
రాంచి : ఉక్కు నగరమైన జంషెడ్‌పూర్‌లో తలెత్తిన మత ఉద్రిక్తతలపై సిపిఎం జార్ఖండ్ రాష్ట్ర కార్యదర్శివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలోని మాంగో ఏరియాలో శాంతి భద్రతలకు సంబంధించిన ఒక సంఘటన వల్ల మత ఉద్రిక్తత నెలకొందని పేర్కొంది. బిజెపికి చెందిన మతోన్మాద సంస్థలు నగరమంతటా మత సామరస్యతను దెబ్బ తీస్తున్నాయని, ఆ సంస్థల నేరపూరితమైన, రెచ్చ గొట్టే కార్యకలాపాల వల్ల పరిస్థితి చాలా తీవ్రంగా మారుతోందని పేర్కొంది. దీనిపై మౌనంగా ఉండడం ద్వారా ప్రభుత్వం ఆ శక్తులను పరోక్షంగా ప్రోత్సహి స్తున్నట్లు వుందని పేర్కొంది.