2015

అమ్మకానికి గ్రీస్‌

గ్రీస్‌ తన అప్పును సాంతం చెల్లించగలదని ఆశించటం అవాస్తవికమని గ్రీస్‌కు అప్పులిచ్చిన సంస్థలలో ఒకటైన ఐఎంఎఫ్‌ కూడా బహిరంగంగా గుర్తించిన విషయాన్ని కాసేపు మర్చిపోదాం. గ్రీస్‌కు అప్పును చెల్లించటంలో ఎలాంటి ఉపశమనాన్నీ ఇవ్వలేదనుకుంటే ఆ దేశం ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఏదిఏమైనా గ్రీస్‌ను రెండు మార్గాలలో తన అప్పును చెల్లించేలా చేయవలసి ఉంటుంది. మొదటిది, గ్రీస్‌ సరుకులను, సేవలను ఋణదాతలు కొనుగోలుచేసి ఇచ్చిన అప్పుకు సర్దుబాటు చేసుకోవాలి. విదేశీ చెల్లింపుల సమతూకానికి సంబంధించిన కరెంటు ఖాతాలో మిగులు ఉండాలి. అలా ఏర్పడిన మిగులును గ్రీస్‌ తన అప్పు తీర్చటానికి వినియోగిస్తుంది.

డిగ్రీలో సెమిస్టర్‌ ఎవరి కోసం?

డిగ్రీ కళాశాలలను అభివృద్ధి చేసి, ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేసి అంతర్జాతీయ ప్రమాణా లతో నూతన కోర్సులను ప్రవేశపెట్టి, ప్రమాణాలు పెంచాల్సిన ప్రభుత్వం ఆ దిశగా అలోచనలకు ఆమడ దూరంలో ఉంది. ఇప్పటి దాకా డిగ్రీలో ఉన్న మూడు సంవత్సరాల పరీక్షల స్థానంలో ఆరు సార్లు పరీక్షలు నిర్వహించే ''సెమిస్టర్‌ విధానాన్ని'' అమలు చేయడానికి సిద్ధం అవుతున్నది. ఈ విధానాన్ని ఎవరి ప్రయోజనాల కోసం అమలు చేస్తున్నారు?

అట‌వీభూముల‌స్వా‌ధీనంపై మైల‌వ‌రంలో రాస్తారోకో

పేద‌ల సాగులో ఉన్న అట‌వీ భూముల‌ను స్వా‌ధీనం చేసుకోవ‌ద్ద‌ని కోరుతూ సిపిఎం ఆధ్వ‌ర్యంలో కృష్ణా జిల్లా మైల‌వ‌రం జాతీయ ర‌హ‌దారిపై రాస్తా‌రోక జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రాష్ర్ట కార్య‌ద‌ర్శి పి.మ‌ధు ను పోలీసులు అరెస్టు చేశారు. త‌ద‌నంత‌రం పోలీసులు మైల‌వ‌రం పోలీసు స్టే‌ష‌న్ కు త‌ర‌లించారు. పోలీసుల‌కు పేద‌ల‌కు మ‌ద్య వాగ్వా‌దం జ‌రిగింది. పోలీసులు విచ‌క్ష‌ణ ర‌హితంగా వారిని ఈడ్చి పారేశారు.  

సిపిఎం మ‌ధు అరెస్టు‌..

కృష్ణాజిల్లాలోని మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూమిలో సాగుచేస్తున్న పేదలను తొలగించరాదని సీపీఎం ఆందోళన చేసింది. మైలవరం మార్కెట్‌యార్డు దగ్గర హైవేపై బైఠాయించి నేతలు ధర్నా చేశారు. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏపీ కార్యదర్శి మధుతో పాటు సీపీఎం నేతలు, వందలాది మంది చిన్న, సన్నకారు రైతులు పాల్గొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నేతలు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మధు మాట్లాడుతుండగా పోలీసులు మైక్‌ లాక్కొని...ఆయన్ను అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై సీపీఎం నేతలు, సాగుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJPఅప్పుడు అలా..ఇప్పుడు ఇలా

 పార్లమెంట్‌ను స్తంభింపచేయటం తప్పుకాదనీ, మంత్రుల అవినీతిపై చర్చ జరిగితే ప్రభుత్వం బయటపడిపోతుందే తప్పించి ఒదిగేదేమీ ఉండదని గతంలో వాదించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పుడు బాణి మార్చి ప్రతిపక్షాలను తప్పుపట్టటం బిజెపి ద్వంద్వనీతికి నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు విమర్శించారు. యుపిఏ హయాంలో అవినీతి ఆరోపణలలో చిక్కుకున్న నట్వర్‌సింగ్, పవన్ కుమార్ బన్సల్, అశ్వనీ కుమార్ మంత్రి పదవులకు రాజీనామా చేస్తే తప్పించి పార్లమెంట్ నడవదని అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా బిజెపి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఆగస్టు11న రాష్ట్ర బంద్‌..

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై ఆగస్టు 10వ తేదీలోగా పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన రాకపోతే ఆగస్టు 11న రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు 25వ తేదీన జరిగిన ప్రజా సంఘాల సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని విభజన బిల్లులో పేర్కొన్నా ఆచరణలో అదేమీ కనిపించడం లేదని అందులో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం తరుపున కేంద్రానికి పంపిన నివేదికలు బుట్టదాఖలయినా మాట్లాడకపోవడం శోచనీయమని తెలిపారు.

మోడీ కోసం ఇడి ప్రయత్నాలు..

మనీ లాండరింగ్‌కి పాల్పడి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ఐపిఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోదీని దేశానికి రప్పించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ప్రయత్నాలు ప్రారంభించింది. లలిత్ మోదీపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సిందిగా ముంబయిలోని సెషన్స్ కోర్టును ఈడి కోరింది. లలిత్ మోదీపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదైంది. విచారణను తప్పించుకుని మోదీ లండన్ తప్పించుకుపోయాడు. కాగా ఈడి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పేరుతో జూలై 3న నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా న్యాయస్థాం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

అబ్దుల్ కలాం కన్నుమూత

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపిజె అబ్దుల్‌ కలాం (84) సోమవారం కన్నుమూశారు. ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త కూడా అయిన కలామ్‌ మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌లో సోమవారం సాయంత్రం ప్రసంగిస్తూ, 6.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలారు. చికిత్స నిమిత్తం ఆయనను మేఘాలయ రాజధాని నాంగ్రిమ్‌ హిల్స్‌లోని బెథాని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సనిందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈశాన్య ప్రాంత హెల్త్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌ఇఐజిఆర్‌ఐహెచ్‌ఎంఎస్‌) నుంచి వైద్యులను బెథాని ఆసుపత్రికి ప్రత్యేకంగా రప్పించారు.

విమ్స్‌ ఆసుపత్రిని తక్షణమే ప్రారంభించాలని, ప్రైవేట్‌పరం చేయరాదని సిపిఐ(యం) ధర్నా

విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)ను రాష్ట్రప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని, దీనిని ప్రైవేట్‌పరం చేయరాదని డిమాండ్‌ చేస్తూ నేడు విశాఖజిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద సిపిఐ(యం) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.

వ్యూహాత్మకంగానే వివాదాల పెంపు

హైదరాబాదును తామే అభివృద్ధి చేశామన్న ప్రచార వ్యూహం మానుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. ఆయన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా కొట్టిపారేయడం లేదా తెలుగుదేశంపై విమర్శకు పరిమితం కావడం వల్ల తనకు రాజకీయంగా కలిగే ప్రయోజనం ఉండదని చంద్రశేఖర రావు భావిస్తారు. అందువల్ల వాటిని ఖండించడంతో ఆగరు. అనివార్యంగా 'ఆంధ్రోళ్లు' అంటూ పల్లవి జోడిస్తారు. ఆఖరుకు మునిసిపల్‌ సమ్మెను కూడా ఆంధ్రా పార్టీలు నడిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించడం ఇందుకు పరాకాష్ట.

Pages

Subscribe to RSS - 2015