2015

ఆధార్‌ తప్పనిసరి కాదు:సుప్రీం

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పథకాల అమల్లో ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్రాలతోపాటు సంబంధిత అధికారులకు కూడా స్పష్టం చేసినట్లు జస్టిస్‌ చలమేశ్వర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పింకీ ఆనంద్‌ వివరించారు.

ఇదేనా మహిళోద్ధరణ అంటే..

విదేశీ పెట్టుబడిదారులతో దేశం అధోగతిపడుతోందని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి సింగపూర్‌, జపాన్‌ల వంటి వలస పాలన అవసరం లేదని ధ్వజమెత్తారు. సొంత వనరులపై ఆధారపడి ప్రభుత్వాలు పాలన సాగించాలని ఆయన సూచించారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ˜ీ, మద్య నియంత్రణ అంశాలపై శుక్రవారం ఇక్కడ మహిళా సంఘాల రాష్ట్ర సదస్సులో ఆయన ప్రసంగించారు.. ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి. జయలక్ష్మి అధ్యక్షత వహించారు. సదస్సులో మధు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించినట్లుగా మహిళలకు సంపూర్ణ రుణమాఫీ న్యాయ సమ్మతమేనన్నారు.

ఉరిశిక్షలను రద్దుచేయాలి:ఏచూరి

దేశంలో ఉరిశిక్షను రద్దు చేయవలసిన సమయం అసన్నమయ్యిందని సిపిఎం అభిప్రాయపడింది. ప్రపంచంలోని అనేక దేశాలు అత్యంత హేయమైన ఈ శిక్షను రద్దుచేశాయని చెబుతూ మనదేశం కూడా ఉరిశిక్షను రద్దుచేయటం అభిలషణీయమని రాజ్యసభలో సిపిఎం పక్షం నాయకుడు సీతారామ్ ఏచూరి చెప్పారు. మెమన్ ఉరి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం అని అన్నారు..

ఇకపై ప్రత్యేకహోదా లేదు..

ఇకపైన ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో కేంద్ర మంత్రి రావ్ ఇందర్ జిత్ సింగ్ మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రం వద్ద ఏ ప్రత్యేక విధానమూ లేదని తెలిపారు. అయితే దీనిపై మన రాష్ట్ర ఎంపీలు నోరు మెదపలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బీహార్ పర్యటన సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు కానీ ప్రత్యేక హోదాపై ఏ హామీ ఇవ్వలేకపోయారు.

పేదల పొట్టగొడుతున్న ప్రభుత్వం..

పేదల పొట్టగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. గురువారం కృష్ణాజిల్లా నాగాయలంకలో జరిగిన కోడూరు, నాగాయలంక మండలాల మత్స్యకారుల సదస్సులో ఆయన మాట్లాడారు. దశాబ్దాల తరబడి పేదలు సాగుచేసుకుంటున్న భూములను విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసే పనిలో ముఖ్యమంత్రి నిమగమయ్యారని విమర్శించారు. లక్షలాది ఎకరాల భూమిని పేదల నుండి బలవంతంగా లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దివిసీమలోని 15 వేల మత్స్యకార కుటుంబాలకు చెందిన దాదాపు 20 వేల ఎకరాల భూమిని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

మొమెన్ ఉరికి ప్రతీకారం..

ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష విధించినందుకు దావూద్ ఇబ్రహీం గ్యాంకు ప్రతీకారం తీర్చుకోవచ్చని, ఒకప్పటి ఆయన అనుచరుడు చోటా షకీల్ వ్యాఖ్యానించాడు. ఇదే కేసులో నిందితుడిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న చోటా షకీల్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఫోన్ చేసి మాట్లాడాడు. మెమన్ ఉరి ఘటనను దావూద్ సీరియస్ గా తీసుకున్నాడని తెలిపాడు. తన సోదరుడు టైగర్ చేసిన పాపాలకు మెమన్ బలయ్యాడన్న షకీల్, నిరపరాధిని దోషిగా చూపి ఉరేశారని ఆరోపించారు.

మోడీపై ఆరెస్సెస్ గుర్రు...

దాయాదీ పాకిస్థాన్ పై భారత ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అసంతృప్తితో ఉందట. భారత్ పై దండెత్తుతున్న ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాక్ తో చర్చల పేరిట మోడీ సర్కారు అంత ఆసక్తి కనబరచాల్సిన అవసరం ఏముందని కూడా కొందరు ఆరెస్సెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా పాక్ పై వైఖరికి సంబంధించి గత యూపీఏ అనుసరించిన వైఖరితోనే ఎన్డీఏ ప్రభుత్వం కూడా ముందుకెళుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతిష్టంభనకు తెరదించాలి!

లలిత్‌ గేట్‌, వ్యాపం కుంభకోణాలు ఊహించిన విధంగానే పార్లమెంటును కుదిపేశాయి. వర్షాకాల సమావేశాలు తొలి రోజున మొదలైన ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్లమెంటు పదే పదే వాయిదా పడడానికి ఎవరు కారకులు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ప్రతిపక్షాలే పార్లమెంటును అడ్డుకుంటున్నాయని, చర్చ జరగడం ఇష్టం లేకే ఇలా చేస్తున్నాయని బిజెపి, మోడీ ప్రభుత్వం చేస్తున్న వాదన పసలేనిది. ప్రతిపక్షాలు పార్లమెంటులో కోరుతున్నదేమిటి?

రక్తదాహంతోనే ఉరి..

‘డెత్‌వారెంట్‌పై స్టే ఇవ్వాలంటూ యా కూబ్‌ దాఖలు చేసిన ఆఖరి ఫిర్యాదును సుప్రీం కోర్టు కొట్టివేయడం నిరుత్సాహాన్ని కలిగించింది. ఈ నిర్ణయం సరికాదు. అసంతృప్తితో ఉన్నా. సుప్రీం కోర్టు విషాదకరమైన పొరపాటు చేసిందని నా అభిప్రాయం’ అని యాకూబ్‌ లాయర్‌ ఆనంద్‌ గ్రోవర్‌ అన్నారు. రక్తదాహంతో ఉన్నవారు యాకూబ్‌ను ఉరితీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాకూబ్‌ తరఫు వాదించిన మరో న్యాయవాది మీడియాపట్ల అసహనం వ్యక్తం చేశారు. యాకూబ్‌ ఉరిశిక్షపై స్పందించాలని మీడియా ప్రశ్నించగా..‘మా కక్షిదారు చనిపోతున్నాడు. నా మీద దయ చూపించండి’అని వ్యాఖ్యానించారు.

సమ్మెతో సరైన సమాధానం చెప్పాలి

హక్కుల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని కార్మికులు, ఉద్యోగులకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో అరబిందో పరిశ్రమ వద్ద బుధవారం నిర్వహిచిన 'కార్మిక గర్జన' సభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్ట సవరణలను, కార్మిక ఉద్యమాలపై నిరంకుశ దాడులను, సామాజిక సంక్షేమ పథకాల నిధుల్లో కోతను విరమించాలని డిమాండ్‌ చేశారు.

Pages

Subscribe to RSS - 2015