2015

అక్రమంగా నిల్వ ఉంచిన 102 ఉల్లి పట్టివేత..

 

హైదరాబాద్:విశాఖ నగరంలోని జ్ఞానాపురంలోని హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 102 టన్నుల ఉల్లిగడ్డలను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్రలో ఉల్లిని కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు.

విషాహారం తిన్న 12 మంది విద్యార్థులకు అస్వస్థత

 

కర్నూలు:కోడుమూరు మండలం అమడగుంట్ల బీసీ హాస్టల్‌లో విషాహారం తిన్న 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. హాస్టల్‌ అస్వస్థతకు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ప్రత్యేక హోదా:రామకృష్ణ

తూ.గో:ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని సీపీఐ నేత రామకృష్ణ చెప్పారు. ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లా తునికి చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో పదిరూపాయలకే బిర్యానీ తింటున్న ఎంపీలు రాష్ర్టాన్ని పట్టించుకోవటం లేద ని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 11న రాష్ట్ర బంద్‌ చేపట్టనున్నట్లు రామకృష్ణ వివరించారు.

సింగపూర్‌ కంపెనీలకు జూ స్థలం కట్టబెట్టొద్దు - సిపిఐ(యం)

సింగపూర్‌ కంపెనీల నైట్‌సఫారీలకోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం విశాఖనగరంలో ఉన్న 625 ఎకరాల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ జూ పార్కును ఎదురుగా ఉన్న కంబాల కొండలోపెడతామని అంటున్నారు. ఇంతవిశాలమైన స్థలాన్ని వదిలి చిన్న స్థలంలో పెడతామని చెప్పడం సరైనదికాదు. ఈ రోజు సిపిఐ(యం)పార్టీ జూపార్కును తరలించొద్దని జూ వద్ద ధర్నా నిర్వహిస్తే జూ సందర్శానికి వచ్చిన పర్యాటకులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. రష్యానుండి వచ్చిన వారుసైతం దీన్ని వ్యతిరేకించినా చంద్రబాబునాయుడు ప్రభుత్వం దున్నపోతుమీద వర్షం కురిసిన చందంగా వ్యవహిస్తోంది.

Pages

Subscribe to RSS - 2015