2015

ఏపీ ప్రత్యేక హోదా పై కారత్

ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ డిమాండ్ చేశారు. 'ప్రజాస్వామ్యం- కార్పొరేట్ రాజకీయాలుస అనే అంశం పై గుంటూరులో సదస్సు జరిగింది. ఈ సదస్సులో పధ్రాన వ‌క్త‌గా కారత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదాపై వాగ్ధానాలు గుప్పించిన బిజెపి ఇప్పుడెందుకు మాట మార్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని మంత్రి ఇంద్రజిత్ ప్రకటించడం సరికాదన్నారు.

హోదా రాదని బాబుకూ తెలుసు

ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం నాయకుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆ హోదా రాదని, చంద్రబాబు సహా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెలేలందరికీ ముందే తెలిసినా ప్రజలను నమ్మించేందుకు ప్రయత్ని స్తున్నారని అనంతపురం ఎంపీ జె.సి.దివాకరరెడ్డి అభిప్రాయ పడ్డారు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశం సందర్భంగా శనివారం విజయవాడ వచ్చిన ఎంపీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దివాకరరెడ్డి మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడు ఒకవిధంగా, ఉనప్పుడు మరో విధంగా మాట్లాడటం సరికాదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తొక్కిసలాట ఫుటేజి మాయం!

రాజమండ్రి దుర్ఘటనలో ప్రభుత్వ విచారణ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి పుష్కరాల సందర్భంగా గతనెల 14న పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘాట్‌ వద్ద ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరిగినా పసిగట్టేందుకు రూ.2 కోట్లు ఖర్చుచేసి ఆర్భాటంగా సిసి కెమెరాలు ఏర్పాటుచేశారు. దీనిపై రెండు రోజుల ముందే ట్రైల్‌ వేశారు. అన్నీ సజావుగా పని చేస్తున్నాయని నిర్ధారించారు. ఇంత పక్కా ఏర్పాట్లు చేసినా జరగాల్సిన ఘోరం జరిగి పోయింది. తొక్కి సలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని... దీనిపై న్యాయ విచారణకు ఆదేశించామని ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రకటించారు.

క్రిడా కార్యాలయం ముట్టడి

కౌలు చెక్కులివ్వాలని డిమాండ్‌ చేస్తూ అసైన్డ్‌, సీలింగ్‌ భూముల రైతులు తుళ్ళూరు క్రిడా కార్యాలయాన్ని ముట్టడించారు. లైబ్రరీ సెంటర్‌ నుండి ర్యాలీ నిర్వహించి క్రిడా కార్యాలయం ఎదుట గంటకు పైగా బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పేద వ్యవసాయ కూలీలకు రూ. 2,500 పింఛన్‌, అసైన్డ్‌, సీలింగ్‌ భూముల రైతులకు కౌలు చెక్కులివ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్రిడా ప్రాంత సిపిఎం కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు, సిపిఎం డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఎం.రవి, నాయకులు జొన్నకూటి వీర్లంకయ్య, నవీన్‌ప్రకాష్‌ ఆందోళనకు మద్దతు తెలిపారు.

ర్యాగింగ్‌పైరగిలినవిద్యార్థులు

నాగార్జున యూనివర్సిటి బిఆర్క్‌ విద్యార్థిని రిషితేశ్వరి మృ తికి కారకులైన దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని, సిట్టింగ్‌ జడ్జితో ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘ నేతలు రోడ్డెక్కారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చం ద్రబాబు స్పందించి బాధ్యులైన వారిని అరెస్టు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు,అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులకు మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకొన్నాయి.

మాప్రాణాలు పోయిన అడ్డుకొంటాం:సిపిఎం

గతంలో పట్టాలిచ్చిన అటవీ భూములను చంద్రబాబు తిరిగి లాక్కోవాలని చూస్తున్నారని,మా ప్రాణాలు పోయినా సరే అడ్డుకొని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు.

ఏపికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలకు సిద్ధం

రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పిస్తామని కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయకపోతే ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు .ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని శుక్రవారం మరోసారి కేంద్ర మంత్రి లోక్‌సభలో ప్రకటించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా అప్పటి ప్రధాని, ప్రతిపక్షపార్టీ నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్ర‌త్యేక హోదా కై ఉద్య‌మం...సిపిఎం రాష్ట్ర క‌మిటి

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర మంత్రి ఈ రోజు లోక్‌సభలో ప్రకటించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్రకమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.
రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బ్లిుపై చర్చ సందర్భంగా ఆ నాటి ప్రధాని చేసిన ప్రకటన, నాటి ప్రతిపక్ష పార్టీ నాయకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాని రాష్ట్రకమిటి డిమాండ్‌ చేస్తున్నది.

మరో ఆధార్‌ దేనికి..?

రాష్ట్రంలో నివసిస్తున్న పౌరులందరినీ ఆధార్‌ తరహాలో గుర్తించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఒక విధానం ప్రకటించి ఇప్పటికే ఉన్న కేంద్ర ఆధార్‌ను ప్రశ్నార్థకం చేసింది. ఆధార్‌తోనే నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ఆధార్‌ మరిన్ని తలనొప్పులు, గందరగోళం తెచ్చిపెట్టడం ఖాయం. ప్రజల సమస్త వివరాలనూ సేకరించేందుకు ఎపి యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్స్‌ పాలసీ తెస్తూ ఎపి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిపార్టుమెంట్‌ బుధవారం వెలువరించిన 16వ నెంబర్‌ జీవోలో పేర్కొన్న పలు అంశాలు పేదలనూ, ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న వారినీ మరింతగా వడపోసి తగ్గించేందుకు, పథకాలకు దూరం చేసేందుకు ఉద్దేశిం చినవి.

Pages

Subscribe to RSS - 2015