దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల గణనలో మొత్తం 8,19,58,314 తప్పులు వచ్చినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిదిద్దాల్సిందిగా అన్ని రాషా్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామని, ఇప్పటిదాకా 6,73,81,119 తప్పులను సరిదిద్దగా, ఇంకా 1,45,77,195 తప్పులను దిద్దాల్సి ఉందని కేంద్ర హోం శాఖ తెలిపింది. అయితే కులపరమైన జనాభా గణాంకాలను వెల్లడించకపోవడాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ సమర్థించుకున్నారు. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా వివిధ కులాల జనాభా వివరాలను ప్రభుత్వం వెల్లడించడం లేదన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు.