2015

ప్రజల కోసం ప్రజాశక్తి

ప్రజల పత్రిక ప్రజాశక్తి నేటితో 34 సంవత్స రాలు ముగించుకుని 35వ వసంతంలోకి అడుగిడు తున్నది. ఈ సందరర్భంగా విజయవాడలో నేడు ప్రజాశక్తి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో 'సమకాలీన పరిస్థితులలో మీడియా' అనే అంశంపై సదస్సు జరుగుతున్నది. పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకులు కామ్రేడ్‌ ప్రకాశ్‌ కరత్‌, వివిధ తెలుగు దినపత్రికల సంపాదకులు, మాజీ సంపాదకులు శ్రీ కె రామచంద్ర మూర్తి, శ్రీ కె శ్రీనివాస్‌, శ్రీ రాఘవాచారి, శ్రీ ఈడ్పుగంటి నాగేశ్వరరావు, శ్రీ ఎస్‌ వీరయ్య, శ్రీ తెలకపల్లి రవి, ప్రజాశక్తి సాహితీ సంస్థ ఛైర్మన్‌ శ్రీ వి కృష్ణయ్య ప్రభృతులు సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.

చంద్రబాబు ఫోన్ల కలకలం..

 రాష్ట్రంలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో టిడిపి అధినేత ,ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కొందరితోను ఫోన్‌లో మాట్లాడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ కాల్స్‌కు సంబంధించిన ట్రాన్స్‌స్క్రిప్ట్‌లను శాస్త్రీయంగా రూఢ చేసుకోవడానికి ఎసిబి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. దీంతో ఈ కేసు దర్యాప్తులో ఎసిబి మరో కీలక అడుగు వేసింది. చంద్రబాబునాయుడు, టిఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ల మధ్య సాగిన ఫోన్‌ సంభాషణకు సంబంధించిన ట్రాన్స్‌స్క్రీప్ట్‌ను ఎసిబి సిద్ధం చేసి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు శనివారం అందచేసింది.

2.45కోట్ల ఆహారధాన్యాలు వృథా

ఈ ఏడాది జూన్‌ వరకు భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో రు.2.45కోట్ల విలువ చేసే ఆహార ధాన్యాలు పాడైపోయాయని, క్రమశిక్షణా చర్య తీసుకున్నామని కేంద్ర ఆహారమంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ శనివారం తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో ఆహారధాన్యాలను శాస్త్రీయమైన పద్ధతుల్లో నిల్వ చేస్తారు. జులై ఒకటవ తేది నాటికి 54.5 మిలియన్‌ టన్నుల గోధుమలు, బియ్యంను ఇక్కడ నిల్వ చేసినట్లు తెలిపారు.

స్మార్ట్‌సిటీలలిస్టులోవిజయవాడ

కేంద్ర ప్రభుత్వం విడుదలజేసిన స్మార్ట్‌ సీటీల నామినేషన్‌ జాబితాలో విజయవాడకు చోటు లభించింది. వివిధ రాష్ట్రాల రాజధానులు లక్నో, ముంబయి, గాంధీనగర్‌, జైపూర్‌, భువనేశ్వర్‌, రారుపూర్‌, గౌహతిలతోబాటు విజయవాడ కూడా ఆ జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. 100 స్మార్ట్‌ సిటీలకు నామినేట్‌ అయిన వాటిలో పాట్నా, కోల్‌కతా, బెంగుళూరులకు చోటు దక్కలేదు. ఢిల్లీతో సహా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలూ ఇందులో చేరాయి. తక్కువ ప్రాముఖ్యం కలిగిన నగరాలు, మునిసిపాలిటీలను -బీహార్‌లోని బీహార్‌ షరీఫ్‌, ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌, సహరాన్‌పూర్‌లు, హిమాచల్‌లోని ధరమ్‌శాల, కర్ణాటకలోని శివమొగ్గలను- రాష్ట్రాలు నామినేట్‌ చేశాయి.

జన్‌ధన్‌ తరహాలోఎపి సొంతబీమా

దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తిరపు కార్డులు ఇవ్వాలన్న ఆధార్‌ విధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం లేనట్టు కనిపిస్తోరది. అరదుకే సొరతంగా అరదరికీ ఒక నంబర్‌ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం యూనిక్‌ ఐడెరటిటీ ఫర్‌ రెసిడెరట్స్‌ పేరిట ఒక విధానాన్ని ప్రకటిరచిరది. దీనిపై ప్రత్యేక సర్వే కూడా నిర్వహిరచాలని నిర్ణయిరచిరది. అలాగే కేదద్రం అమలు చేస్తున్న జన్‌ధన్‌ యోజన పథకానికి దీటుగా రాష్ట్రంలోకూడా మరో బీమా పథకానికి సమాలోచనలు చేస్తోరది. దీనికోసం ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయి.

కార్పొరేట్ క‌నుస‌న్నలో మీడియా..

కార్పొరేట్‌ శక్తుల కనుసన్నల్లో నడుస్తున్న ప్రధాన మీడియా కీలకమైన ప్రజాసమస్యలను విస్మరిస్తోందని పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకులు ప్రకాశ్‌కరత్‌ అన్నారు. ప్రజాశక్తి 35వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా 'వర్తమాన పరిస్థితులు-మీడియా' అనే అంశంపై శనివారం సాయంత్రం విజయవాడలో జరిగిన సెమినార్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రజాశక్తి సంపాదకులు పాటూరు రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కార్పొ రట్లకు, రాజకీయనేతలకు మధ్య అపవిత్ర పొత్తు నెల కొందని, అదే పరిస్థితి మీడియా రంగానికి వ్యాపించిందని చెప్పారు. వ్యాపారస్తులే మంత్రులుగా మారుతున్నారని, మీడియా సంస్థలనూ ఏర్పాట చేస్తున్నారని చెప్పారు.

ప్రజాసమస్యలపై ప్రచారోద్యమం..

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలని కోరుతూ సిపిఎం ప్రచారోద్యమం ప్రారంభించింది. స్థానిక సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆ పార్టీ శ్రేణులు ప్రజల వద్దకెళ్లి అభివృద్ధికి ఆటంకాలేమిటన్న దానిపై చర్చించారు. వివిధ ప్రాంతాల్లో ప్రజా చైతన్య సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిపై ప్రచారం చేశారు. కరపత్రాలు పంపిణీ చేశారు.

మహిళా ప్రాతినిధ్యం

'అతివలు ఆకాశంలో సగం. అవనిపై సగం' అన్న మాటలు వింటే చాలు మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. కాని అభివృద్ధిలో వారి వెనుకబాటునూ, కట్టుబాట్లమధ్య నలిగిపోతున్న వారి పరిస్థితినీ చూస్తే మనసు దుఖంతో చలించిపోతుంది. బీహార్‌ మహిళలు సరిగ్గా ఈ స్థితిలోనే ఉన్నారు. జనాభా రీత్యా దేశంలోకెల్లా మూడవ అతి పెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్‌లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లను మించిపోయింది. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల గణాంకాలు ప్రపంచానికి చాటిచెప్పిన వాస్తవమిది.

Pages

Subscribe to RSS - 2015