రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలని కోరుతూ సిపిఎం ప్రచారోద్యమం ప్రారంభించింది. స్థానిక సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆ పార్టీ శ్రేణులు ప్రజల వద్దకెళ్లి అభివృద్ధికి ఆటంకాలేమిటన్న దానిపై చర్చించారు. వివిధ ప్రాంతాల్లో ప్రజా చైతన్య సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిపై ప్రచారం చేశారు. కరపత్రాలు పంపిణీ చేశారు.