సింగపూర్‌ కంపెనీలకు జూ స్థలం కట్టబెట్టొద్దు - సిపిఐ(యం)

సింగపూర్‌ కంపెనీల నైట్‌సఫారీలకోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం విశాఖనగరంలో ఉన్న 625 ఎకరాల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ జూ పార్కును ఎదురుగా ఉన్న కంబాల కొండలోపెడతామని అంటున్నారు. ఇంతవిశాలమైన స్థలాన్ని వదిలి చిన్న స్థలంలో పెడతామని చెప్పడం సరైనదికాదు. ఈ రోజు సిపిఐ(యం)పార్టీ జూపార్కును తరలించొద్దని జూ వద్ద ధర్నా నిర్వహిస్తే జూ సందర్శానికి వచ్చిన పర్యాటకులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. రష్యానుండి వచ్చిన వారుసైతం దీన్ని వ్యతిరేకించినా చంద్రబాబునాయుడు ప్రభుత్వం దున్నపోతుమీద వర్షం కురిసిన చందంగా వ్యవహిస్తోంది. జూ తరలింపు ఒక్క కమ్యూనిస్టు పార్టీలే కాదు పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు వారంతా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ఈ జూ పార్కు తరలింపు చర్యలు చంద్రబాబునాయుడు విరమించుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.