
ఇకపైన ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో కేంద్ర మంత్రి రావ్ ఇందర్ జిత్ సింగ్ మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రం వద్ద ఏ ప్రత్యేక విధానమూ లేదని తెలిపారు. అయితే దీనిపై మన రాష్ట్ర ఎంపీలు నోరు మెదపలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బీహార్ పర్యటన సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు కానీ ప్రత్యేక హోదాపై ఏ హామీ ఇవ్వలేకపోయారు.