
మనీ లాండరింగ్‌కి పాల్పడి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ఐపిఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోదీని దేశానికి రప్పించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ప్రయత్నాలు ప్రారంభించింది. లలిత్ మోదీపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సిందిగా ముంబయిలోని సెషన్స్ కోర్టును ఈడి కోరింది. లలిత్ మోదీపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదైంది. విచారణను తప్పించుకుని మోదీ లండన్ తప్పించుకుపోయాడు. కాగా ఈడి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పేరుతో జూలై 3న నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా న్యాయస్థాం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీనికి ఎలాంటి జవాబురాకపోవడంతో అతడి ఈ మెయిల్ ద్వారా మరో నోటీసును పంపారు. దానికీ ఎలాంటి స్పందన కనిపించలేదు.అయితే మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడి నుంచి తనకు ఎలాంటి నోటీసు అందలేని లలిత్ మోదీ శనివారం ప్రకటించాడు.