2015

ముందు రాహుల్ క్షమాపణ చెప్పాలి..

ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో అడుగుపెట్టాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ నేతలకు ఇక్కడి ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధినేత కుమారుడు రాహుల్‌గాంధీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రంలో అడుగుపెడుతున్నారని నిలదీశారు. మరో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ సోనియా, రాహుల్‌ ప్రజలకు తీవ్ర నష్టం చేశారని, ఏకపక్షంగా మాటలు విని రాష్ట్రాన్ని విభజించారని తీవ్రంగా విమర్శించారు.

ఆగస్టు 1 నుండి 14 వరకు సి పి యం ఆధ్వర్యంలొ జరిగే రాజకీయ ప్రచార కార్యాక్రమాన్ని జయప్రధం చేయండి:- జిల్లా కార్యధర్శి పాశం రామారావు

సి పి యం కేంద్రకమిటీ పిలుపులొ మేరకు జిల్లాలో వివిధ అంశాలపై ప్రత్యామ్నాయా విధానలను ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో బి జె పి రాష్ట్రంలో టి డి పి పార్టీలు ఆధీకారంలొకి రావడనికి అవినీతిలేని స్వచ్చమైన పరిపాలన అందిస్తామని, దేశన్ని అభివృద్ది పధంలో నడిపిస్తామని వాగ్ధానం చేశారు. కాని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవినీతి కుంభకోణాలలో మునిగిపొయారు. లలీతమొడికి వీసాకి సాహయం చేయటంలొ,వ్యాపం కుంభకోణంలో బి జె పి పాత్ర ఉంది. రాష్ట్రంలో ఇసుక, వొటుకు-నొటు వంటి పలు అవినీతి కర్యాక్రమాలలో తి డి పి కురుకుపొయింది.

లలిత్‌మోదీపై రాజ్యసభలోగందరగోళం

లలిత్‌ మోదీ వ్యవహారంపై రాజ్యసభలో గందరగోళం నెలకొనడంతో సభ అరగంట వాయిదా పడింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే లలిత్‌మోదీ విషయమై చర్చకు కాంగ్రెస్‌ పట్టుబట్టింది. వీసా వివాదంపై చర్చకు సిద్ధమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేసినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ సభను వాయిదా వేశారు.

Pages

Subscribe to RSS - 2015