2015

నేడు ప్రభుత్వదిష్టిబొమ్మల దగ్దం

అక్రమ అరెస్టులు, ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జెఎసి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. 18న ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్దం చేయాలని, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని జెఎసి పిలుపునిచ్చింది. 18, 19తేదిల్లో ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిల మద్దతు కోరుతూ సామూహిక రాయబారాలు నిర్వహించాలని, 20న కుటుంబ సభ్యులతో భిక్షాటన, 21న జిల్లా కలెక్టరేట్ల పికెటింగ్‌, 22న రాస్తారోకోలు, 23న పట్టణాల్లో నిరసన ర్యాలీలు, 24న మంత్రుల ఇళ్లను హోరావ్‌ కార్యక్రమాలను జయప్రదం చేయాలని మున్సిపల్‌, ఉద్యోగులు, కార్మికులకు జెఎసి విజ్ఞప్తి చేసింది.

మున్సిపల్‌ కార్మికులపై పాశవిక దాడి

మున్సిపల్‌ కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో ఛలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి యత్నాన్ని పోలీసులు శుక్రవారం అడుగడుగునా అడ్డుకున్నారు. మహిళలను సైతం విచక్షణ రహితంగా లాగిపారేస్తూ పాశవికంగా వ్యవహరించారు. మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది మున్సిపల్‌ పారిశుద్య కార్మికులు, వీరి ఆందోళనకు మద్దతుగా నిలిచిన వామపక్ష పార్టీలకు చెందిన నాయకులతో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ప్రారంభమైన భారీ ర్యాలీని పోలీసులు పాత బస్టాండ్‌ సెంటరులో అడ్డుకున్నారు. ఒకింత భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరిచారు.

జిఎస్‌టి బిల్లుప్రజలపైభారం:మధు

 'గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ బిల్లు తో ప్రజలపై పెనుభారం పడుతుంది'. పన్నుల విధానంలో పెనుమార్పులు తీసుకువచ్చే జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేస్తోంది.కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినప్పటికీ స్థూలంగా అంగీకరించారంటూ ముందడుగు వేయడానికి కేంద్రం సిద్దమైందని అన్నారు..

మంత్రులను తిరగనివ్వం:కార్మిక జేఏసీ

విజయవాడ లో సమస్యల పరిష్కారానికి మున్సిపల్‌ కార్మికులు తమ సమ్మెను మరింత ఉధృతం చేశారు. 13 జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన కార్మికులు బందర్‌రోడ్డులోని సీఎం ఆఫీసు ముట్టడికి యత్నించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పలువురు మున్సిపల్‌ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్మికులు మాట్లాడుతూ ఈనెల 20 నుంచి సీఎం, మంత్రుల ఆఫీసు ఎదుట ధర్నాలు చేస్తామని, మంత్రులను జిల్లాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. డిమాండ్లు తీర్చేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ మున్సిపల్‌ కార్మిక జేఏసీ స్పష్టం చేసింది.

మున్సిపల్ కార్మికుల అరెస్టు

తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో అట్టుకుడుతోంది. ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఉన్న ఏపీ సీఎంక్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన మున్సిపల్ కార్మికులను, కార్మిక నేతలను బందర్ రోడ్డులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్మికుల సమ్మెకు మద్ధతుగా సీఐటీయూ, సీపీఎం చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి పెద్ద ఎత్తున కార్మికులు బయలుదేరారు. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న సీఐటీయూ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

ఆంధ్రకు ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ

 ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గం, ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్ రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయటంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన జాతీయ తుపాను ప్రమాద నివారణ మొదటి దశ పథకానికీ పచ్చ జెండా ఊపింది.

హిందూదేశంగా చేయడమే లక్ష్యం

భారతదేశాన్ని హిందూ దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ విశ్వహిందూ పరిషత్‌ కృషి చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్‌తొగాడియా చెప్పారు. జిల్లాలోని అశ్వరావుపేటలో పర్యటించిన ప్రవీణ్‌తొగాడియా మీడియాతో మాట్లాడారు. మత మార్పిడులను అడ్డుకోవడంతోపాటు గోపూజలు చేయడం, పేద హిందువులకు ఉచితంగా విద్యా, వైద్యం అందించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామన్నారు. ముస్లిమ్‌లు, క్రైస్తవులకు మక్కా, వాటికన్‌ సిటీల యాత్రలకు డబ్బులు ఇస్తున్నారని కాని హిందువులను విస్మరిస్తున్నారన్నారు. హిందువుల అభివృద్ధికి తాము కట్టుబడి పనిచేస్తున్నామన్నారు.

Pages

Subscribe to RSS - 2015