మున్సిపల్ కార్మికుల అరెస్టు

తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో అట్టుకుడుతోంది. ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఉన్న ఏపీ సీఎంక్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన మున్సిపల్ కార్మికులను, కార్మిక నేతలను బందర్ రోడ్డులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్మికుల సమ్మెకు మద్ధతుగా సీఐటీయూ, సీపీఎం చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి పెద్ద ఎత్తున కార్మికులు బయలుదేరారు. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న సీఐటీయూ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పోలీసులకు, లెఫ్ట్‌ కార్యకర్తలకు జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి.