2015

బాల్యాన్నిబలిచేసే చట్ట సవరణ!

కేంద్రంలోని బిజెపి/ఎన్‌డిఎ ప్రభుత్వం బాలల హక్కులను హరించేందుకూ సమాయత్తమైంది. బాలకార్మిక (నిషేధం, నియంత్రణ) చట్టం 1986కు కొన్ని సవరణలు చేయటానికి మే 13న కేబినెట్‌ సమావేశం తీర్మానించింది. ఆ మేరకు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిల్లుపెట్టే అవకాశం ఉంది. ప్రతిపాదిత సవరణలలో బాల్యాన్ని బలిచేసే అంశాలు రెండు ఉన్నాయి. వాటిని పార్లమెంటు ఆమోదిస్తే... ఒకటి, కార్పొరేట్‌ కంపెనీలు, ఫ్యాక్టరీలకు కార్మికులు చౌకగా లభించే 'స'దవకాశం ఏర్పడుతుంది. రెండు, కుల వృత్తుల పేరుతో వర్ణ వ్యవస్థకు, మనుధర్మ శాస్త్రానికి మళ్లీ జీవం పోసినట్లు అవుతుంది.

మున్సిపల్‌ సమ్మె విచ్ఛిన్నానికి సర్కారు కుట్రలు

 మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల సమ్మె గురువారానికి ఎనిమిదవ రోజుకు చేరుకుంది. రోజు రోజుకూ పోరాటం ఉధృత రూపం దాలుస్తోంది. అయితే సమ్మె డిమాండ్లు పరిష్కరించి, సమ్మెను నివారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి, మున్సిపల్‌ శాఖా మంత్రి డాక్టర్‌ నారాయణకు 'రాజమండ్రి పుష్కరాలు' లేదంటే జపాన్‌, సింగపూర్‌ల పర్యటనలకే కాలం సరిపోతుంది తప్ప, వేలాది దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందిన మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల ఆకలి కేకలు పట్టించుకునే తీరికలో లేరు. నగరాలు, పట్టణాలన్నీ మురికి కూపాలుగా మారుతున్నాయి.

సీఎం ఆఫీసు వద్ద ఉద్రిక్తత

తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో అట్టుకుడుతోంది. ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఉన్న ఏపీ సీఎంక్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన మున్సిపల్ కార్మికులను, కార్మిక నేతలను బందర్ రోడ్డులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రైల్వేస్టేషన్లు ప్రైవేట్ పరం

 ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని 400 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ రంగం సాయంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు వెల్లడించారు. దేశంలోని వివిధ పట్టణాలు, నగరాల్లోవున్న ఎ వన్ క్యాటగిరీ, ఎ క్యాటగిరీ రైల్వే స్టేషన్లను ఎక్కడున్నది అక్కడే పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ పార్టీలను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. రైల్వే స్టేషన్ భూమిని వాణిజ్యపరంగా అభివృద్ది చేసేందుకు కూడా అనుమతివ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

కుల దురహంకార హత్యలపై సిపిఎం ఆందోళన

తమిళ నాడులో కుల దురహంకార హత్యలు నానాటికీ పెరుగుతుండటంపై సిపిఎం ఆందోళనను వ్యక్తం చేసింది. ఆత్మగౌరవంతో ఎవరైతే కులాలను ఎదిరించి వివాహాలు చేసుకురటారో వారికి విద్యా సంస్థల్లోను, ఉద్యోగాల్లోను రిజర్వేషన్లు కల్పించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. బుధవారం ముగిసిన పార్టీ రాష్ట్ర కమిటీ రెండు రోజుల సమావేశాలలో ఆమోదించిన తీర్మానాన్ని గురువారం ఈ విడుదల చేసింది. కులదురహంకార హత్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చట్టాన్ని చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కుల సంబంధ సంఘటనలు రాష్ట్రంలో పెరిగిపోయాయని, గత ఏడాది కాలంలోనే గౌరవ హత్యల పేరుతో 60 మందిని చంపేశారని అది పేర్కొంది.

గందరగోళంలో ఏపీ సర్కారు..

రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అయోమయం, గందరగోళానికి గురవుతోంది. ఏడాదిపాటు ఏమీ పట్టించుకోకుండా... పుణ్యకాలం ముగిసిన తర్వాత కూడా ఎటూ తేల్చుకోలేక తికమకపడుతోంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటైన సంస్థలను వాటి కార్యకలాపాలు, పని స్వభావాన్నిబట్టి 9, 10 షెడ్యూళ్లలో చేర్చారు. పదో షెడ్యూల్‌లో విద్యా, శిక్షణా సంబంధిత సంస్థలున్నాయి. ఏ ప్రాంతంలో ఉన్న సంస్థ ఆ రాష్ట్రానికే చెందుతుందని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే... విభజన చట్టం అమలులోకి వచ్చిన ఏడాదిపాటు ఈ సంస్థలు రెండు రాష్ట్రాలకు సేవలందించాల్సి ఉంటుంది.

సిపిఎం ఆధ్వర్యాన వ్యవసాయ సాగు

సిపిఎం ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు కోరంగి కంపెనీ భూముల్లో పోలెకుర్రు పంచాయతీకి చెందిన పేదలు గురువారం నుంచీ వ్యవసాయ సాగు ప్రారంభించారు. జూలై 13న కోరంగి కంపెనీ భూములను సిపిఎం ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతి పేదలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 200 మంది ప్రజలు ఈ భూముల్లో ప్రవేశించి గురువారం దుక్కిదున్నారు. సుమారు 25 ఎకరాల భూములను వీరు కష్టపడి సాగులోకి తెచ్చారు. 15 ఎకరాల భూముల్లో విత్తనాలు వెదజల్లారు. ఈ భూములను 30 ఏళ్లుగా భూస్వాములు అనుభవించారు.సుమారు 15 బస్తాల వరి విత్తనాలను నాటామని తెలిపారు. 

రాష్ట్రాల మధ్య సరికొత్త వివాదం

బేగంపేట ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక గజపతిరాజు పావులు కదుపుతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. బేగంపేట ఎయిర్‌ పోర్టు ప్రాంతంలో.. తెలంగాణ ప్రభుత్వం ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతుంటే.. ఏపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

ఇవాళ ఛలో విజయవాడ

వారం రోజులుగా సమ్మె చేస్తున్నాప్రభుత్వం పట్టించుకోకపోవడం పై మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఇవాళ చలో విజయవాడకు పిలుపునిచ్చారు.

పున:పరిశీలించండి!

భూ సేకరణ చట్ట సవరణపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నిర్వహించిన నీతి ఆయోగ్‌ భేటీకి అధికశాతం ముఖ్యమంత్రులు మొహం చాటేయడం, ఆ చట్టం పట్ల దేశంలో ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తోంది. చట్ట సవరణపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మోడీ ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ సిఎంలు, కాంగ్రెస్‌, బిజెపియేతర సిఎంలతో పాటు ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన పంజాబ్‌ అకాలీదళ్‌ సిఎం కూడా చట్ట సవరణను తోసిపుచ్చడం బిజెపికి మింగుడుపడని విషయం.

Pages

Subscribe to RSS - 2015