2015

కాంగ్రెస్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి

కాంగ్రెస్‌ మరోసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో ప్రభుత్వాన్ని అడ్డుకుంటామని హెచ్చరించిన కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో ఎందుకు అంతగా దిగజారిందో తెలుసుకోవాలని వెంకయ్య అన్నారు.

పార్లమెంట్‌లో తాజా బిల్లు?

విదేశీ ప్రభుత్వాధికారులు లంచాలు ఇవ్వడాన్ని లేదా స్వీకరించడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించి వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి విదేశీ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ ప్రభుత్వ సంస్థల అధికారుల లంచాల నిరోధక బిల్లును 2011లోనే రూపొందించినప్పటికీ గత ఏడాది మే నెలలో 15వ లోక్‌సభ రద్దవడంతో ఆ బిల్లుకు కాలం చెల్లిపోయింది.

కాలంచెల్లిన చట్టాలురద్దు:మోడీ

దేశంలో కార్మిక సంస్కరణల పట్ల వెల్లువెత్తుతున్న విమర్శలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీటుగా సమాధానమిచ్చారు. న్యూఢిల్లీలో సోమవారం ఆయన 46వ అఖిల భారత కార్మిక సదస్సులో ప్రసంగిస్తూ, ఏకాభిప్రాయం సాధించిన తర్వాత మాత్రమే కార్మిక చట్టాలకు మార్పులు, చేర్పులు చేస్తామని, అలాగే కాలం చెల్లిన, అనవసరమైన కార్మిక చట్టాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. దేశంలో కార్మికులు, కార్మిక సంఘాల ప్రయోజనాలకు మధ్య పలుచటి విభజన రేఖ ఉందని, అయినా దీనిని గౌరవించి తీరాల్సిందేనని మోదీ పేర్కొన్నారు.

54ఏళ్ల తర్వాత అమెరికా,క్యూబా దౌత్యం

ఐదు దశాబ్దాలకు పైగా వైరం కొనసాగిన తర్వాత అమెరికా, క్యూబాలు మళ్లీ దౌత్య సంబంధాలు నెలకొల్పుకున్నాయి. 1961 తర్వాత.... తొలిసారిగా వందలాదిమంది సమక్షంలో సోమవారం వాషింగ్టన్‌లోని క్యూబా రాయబార కార్యాలయం వద్ద క్యూబా పతాకాన్ని ఎగురవేయగా క్యూబా రాజధాని హవానాలో అమెరికా పతాకాన్ని లాంఛనంగా ఎగురవేశారు.

ఏపీ సీడ్‌క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌...

 ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అనేక అంశాలు పొందిపరిచారు. బ్రహ్మ స్థానంలో ఏమేమి ఉంటాయి, సచివాలయం ఎక్కడ నిర్మిస్తారు.. హైకోర్టు ఎక్కడ.. తదితర అంశాలు అందులో పొందిపరిచారు.

చట్టాలన్నీ పెళుసు...పాలకులకు పేదలంటే అలుసు

మన చట్టాలన్నీ పెళుసుబారాయి. పాలకులే వాటిని అమలు చేయని నిందితుల జాబితాలోకి చేరుతున్నారు. చట్టాలు చేసే వారే అమలుకు మీనమేషాలు లెక్కించడం విచిత్రం. అందునా పేదలకు సాయం అందించే చట్టాలంటే వారికి మరీ అలుసు! తాజాగా మున్సిపల్‌ కార్మికుల ఆందోళనే అందుకు ఉదాహరణ. మున్సిపల్‌ కార్మికుల్లో 85 శాతం మంది దళిత, గిరిజన పేదలే! వీరు పట్టణాల్లో మురికి, చెత్త, మలిన పదార్థాలను చేతులతో తీస్తూ వెట్టిచాకిరి చేస్తున్నారు. పాకీ పనితో నిజమైన 'స్వచ్ఛ భారత్‌'ను అమలు చేస్తున్నారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండేందుకు పనిచేసే ఆ కార్మికులు మాత్రం దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు.

మరో స్వాతంత్య్రోద్యమం సాగాలి

నాడు సాగించిన స్వాతంత్య్రోద్యమం తరహాలోనే మరో పోరాటం సాగాల్సిన అవసరముందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపునిచ్చారు. స్వాతంత్య్రమొచ్చి 65 ఏళ్లు దాటినా అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని రూపొందించాల్సిన బాధ్యత వామపక్షాలపైనే ఉందని సూచించారు. ఆ దిశగా తాము కృషి చేస్తామని తెలిపారు. ఆదివారం అనంతపురం నగరంలోని వికె.మెమోరియల్‌ హాలులో 'అనంతపురం జిల్లా కమ్యూనిస్టు సీనియర్‌ నాయకుల కుటుంబ సభ్యుల సమ్మేళనం' జరిగింది.

అమరావతి కొత్త జిల్లా‌?

 అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచన పై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, ఏడాది కాలంగా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు చేస్తామని చెబుతున్న మంత్రులు, వాటిని ముందు అమలు చేసి, తర్వాత జిల్లా ప్రతిపాదనలు తీసుకోస్తే బాగుంటుందని అంటున్నారు. మరోవైపు అమరావతి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని అలోచన మంచిదైనప్పటకీ , ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలంటే అనేక శాఖలను అనుసంధానం చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం మంత్రుల కార్యాలయాల తరలింపు సాధ్యం కానప్పుడు , ఇప్పుడు ప్రత్యేక జిల్లా అవసరం ఉండబోదని విశ్లేషకులు అంటున్నారు.

చిత్తూరులో ప్రబలిన డెంగ్యు,విషజ్వరాల నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి ..19. 07. 2015

Pages

Subscribe to RSS - 2015