మంత్రులను తిరగనివ్వం:కార్మిక జేఏసీ

విజయవాడ లో సమస్యల పరిష్కారానికి మున్సిపల్‌ కార్మికులు తమ సమ్మెను మరింత ఉధృతం చేశారు. 13 జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన కార్మికులు బందర్‌రోడ్డులోని సీఎం ఆఫీసు ముట్టడికి యత్నించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పలువురు మున్సిపల్‌ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్మికులు మాట్లాడుతూ ఈనెల 20 నుంచి సీఎం, మంత్రుల ఆఫీసు ఎదుట ధర్నాలు చేస్తామని, మంత్రులను జిల్లాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. డిమాండ్లు తీర్చేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ మున్సిపల్‌ కార్మిక జేఏసీ స్పష్టం చేసింది.