ప్రజలకు అండగా నిలుస్తాం..

మాస్టర్‌ప్లాను నివేదిక ప్రకారం ప్రసుత్తం గ్రామాలు తరలిస్తామంటున్నారని, రేపు ఉన్న ప్రజలనూ తరలించేస్తారని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు అన్నారు. గ్రామాల్లో రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి, నాయకులు నవీన్‌ప్రకాష్‌తో కలిసి పర్యటించారు. ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు ఆందోళనకు దిగడంతో ఎక్కడిక్కడ నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకూ ఊరుకునేది లేదని, ఎంతవరకైనా వెళతామని హెచ్చరించారు. వరదలొచ్చినా వారు ఇక్కడే ఉన్నారని, నష్టపోయారని, ఇప్పుడు కొద్దిమంది లాభం కోసం తరిమేస్తామంటే ఎలా వెళతారని ప్రశ్నించారు. ప్రభుత్వం పేదలను, ముఖ్యంగా దళితులను ఇక్కడ నుండి తరిమేసే ప్రక్రియ మొదలుపెట్టిందన్నారు. పొమ్మనకుండా పొగబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలను తరలించబోమని ఇప్పటి వరకూ చెప్పిన మంత్రులు, ఎమ్మెల్యేలు దీనికి సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.