
బొగ్గు స్కాంలో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సంతోష్ బర్గోడియాకు డిప్లమాటిక్ పాస్ పోర్టును ఇప్పించాలంటూ ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత తనపై ఒత్తిడి తెచ్చారని సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పార్లమెంట్ వేదికగా ఈ విషయాన్ని బట్టబయలు చేస్తానని ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ చేసిన విమర్శలపై ఏఐసిసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లోనే మాట్లాడుతామని పేర్కొన్నారు