పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, విపక్ష నేతలు సమావేశాలకు హాజరయ్యారు. లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, ఇటీవల వరంగల్ ఎంపీ స్థానానికి కడియం శ్రీహరి చేసిన రాజీనామాను ఆమోదించినట్టు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడంతో కడియం ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, ‘వ్యాపం’ కుంభకోణం, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సిఎం వసుంధర రాజె తదితరులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్ష ఎంపీలు కసరత్తు చేస్తున్నారు.