May

భారత రైల్వేలపై కొత్త పెట్టుబడులు

మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున, దేశంలో కొత్త పెట్టుబడుల ద్వారా వ్యాపారాన్ని భారీగా పెంచుకోవాలని కెనడాకు చెందిన అంతర్జాతీయ రవాణా రంగ సంస్థ బొంబాడియర్‌ నిర్ణయించింది. ఇప్పుడు భారత్‌లో 300 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) వ్యాపారం చేస్తున్నామని, అయిదేళ్లలో బిలియన్‌ డాలర్ల (రూ.6,600 కోట్లకు పైగా) వ్యాపారం సాధించాలనేది లక్ష్యమని బొంబాడియర్‌ అధ్యక్షుడు లారెంట్‌ ట్రోగర్‌ తెలిపారు. 

ఆరోగ్య పథకంలో రూ.500 కోట్ల అక్రమాలు

మహారాష్ట్రలో భారీ ఆరోగ్య పథకం ‘రాజీవ్‌గాంధీ జీవనదాయీ ఆరోగ్య యోజన(ఆర్‌జీజేఏవై)’లో అనైతిక వ్యాపార కార్యకలాపాలు, అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఓ టాస్క్‌ఫోర్స్‌ వెలుగులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు ఇటీవల సమర్పించిన నివేదిక ప్రకారం.. ఆర్‌జీజేఏవైలో ఆర్థిక అవకతవకల కారణంగా గత మూడేళ్ల కాలవ్యవధిలో ప్రభుత్వ ఖజానాకు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 

1.5 లక్షల గ్రామాలు కరవు కోరల్లో..

దేశంలో నాలుగో వంతు భాగాన్ని కరవు కబళించివేసిందని, సుమారు 1.5 లక్షల గ్రామాలు కరవు కోరల్లో చిక్కుకున్నాయని లోక్‌సభకు ప్రభుత్వం వెల్లడించింది. 

ఇంకా ఎంత మంది బలికావాలి..?

ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టే రాజధాని నిర్మాణానికి ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారని సీపీఎం నేతలు ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం గురించి గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు వేరే రాష్ట్రం నుండి తీసుకొచ్చిన కార్మికులను ఎంతో గౌరవంగా చూసుకోవాల్సిన అవసరంముందని వారు సూచించారు. ఏపీ తాత్కాలిక రాజధాని వెలగపూడిలో తీవ్ర ఉద్దికత్తల మధ్య సీపీఎం ఎమ్మెల్సీలు ఆ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దాదాపు 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారనీ..వారికి ఎటువంటి మౌలిక సదుపాయాలను కల్పించకుండా పశువులకంటే హీనంగా వారితో పనిచేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాల్యాను అప్పగించడం కుదరదు

వేల కోట్ల రుణాల ఎగవేసి భారత్‌ విడిచి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాను తమ దేశం నుంచి వెళ్లగొట్టలేమని బ్రిటన్‌ స్పష్టం చేసింది.పాస్‌పోర్టు రద్దు చేసినా కూడా తమ దేశ చట్టాల ప్రకారం మాల్యాను పంపించలేమని చెప్పింది. అయితే మాల్యాను వెనక్కి రప్పించడానికి భారత్‌కు సాయం చేస్తామని ప్రకటించింది.

అర్ధాంతరంగా ముగిసిన JNU సమావేశం

జేఎన్‌యూ అకడమిక్‌ కౌన్సిల్‌ (ఏసీ) సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. నిరాహారదీక్ష కొనసాగిస్తున్న విద్యార్థులు మధ్యాహ్నం తమ దీక్షా స్థలాన్ని సమావేశం జరిగే సోషల్‌ సైన్సెస్‌ విభాగం భవనం వద్దకు మార్చారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు అన్ని ద్వారాల వద్ద నినాదాలు చేశారు. వీసీ జగదీశ్‌కుమార్‌ విద్యార్థులున్న చోటి నుంచి కాకుండా వేరే మార్గం గుండా మీటింగ్‌ హాల్‌కు చేరుకున్నారు. విద్యార్థుల వ్యతిరేకతను మూటగట్టుకున్న మాజీ రిజిస్ట్రార్‌ భూపిందర్‌ జుత్షి, ప్రస్తుత రిజిస్ట్రార్‌, రెక్టార్‌, ప్రొక్టార్‌, దళితులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ప్రొ.

పనామాలో మరో 2000 చిట్టా..

పనామా పత్రాల్లోని వివరాల్ని అంతర్జాతీయ పరిశోధక జర్నలిస్టుల కన్సార్టియం(ఐసీఐజే) మరోసారి పెద్దమొత్తంలో విడుదల చేసింది. ఈసారి భారత్‌కు చెందిన 2000 వివరాల్ని బయటపెట్టింది. అందులో 1046 మంది వ్యక్తులకు సంబంధించిన లింకులు, 828 అడ్రసులు, 42 మధ్యవర్తి సంస్థల పేర్లు ఉన్నాయి. నెవడా, హాంగ్‌కాంగ్‌, బ్రిటీష్‌ వర్జీన్‌ ఐల్యాండ్‌వంటి 21 దేశాల్లో నల్ల కుబేరులు అక్రమంగా డబ్బు దాచుకున్నట్టు తెలుస్తున్నది. భారత్‌తోపాటు పలు దేశీయులకు చెందిన 2,14,000 రహస్య కంపెనీల వివరాలను 
కన్సార్టియం ఇప్పుడు వెల్లడించింది

వామపక్షాల యాత్ర..తీవ్ర ఉద్రిక్తత..

ఏపీ తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఏపీ సర్కారు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. ఏపీ తాత్కాలిక రాజధాని ప్రాంతంలో దేవేందర్ అనే కార్మికుడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో గత రెండు రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుడి మృతిపై ప్రభుత్వ స్పందనను నిరసిస్తూ సీపీఎం నేతలు రాజధాని యాత్ర చేపట్టారు. కార్మికులకు మద్ధతు తెలపాటానికి వచ్చిన నేతలపై పోలీసులు లాఠీ చేశారు. 

కార్మిక హక్కుల కోసం రాజధాని యాత్ర

వెలగపూడి సచివాలం ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్తత నెలకొంది. సచివాలయం నిర్మాణ ప్రాంతంలో కార్మికుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామపక్ష నేతలు కార్మికులకు మద్దతుగా వచ్చిన సీపీఎం నేతలను మంగళవారం నాడు లాఠీ ఛార్జ్ జరిపారు. ఈ ఘటనలో సీపీఎం నేతలను  అరెస్ట్ చేసి పోలీసులు  నిర్భంధంలో వుంచారు.కార్మిక పక్ష నేతలమైన మేము దేనికి భయపడమనీ కార్మికులకు మా మద్ధతు ఎప్పుడూ వుంటుందని వామపక్ష నేతలు పేర్కొంటున్నారు.

అగస్టా కుంభకోణంపై సుదీర్ఘ చర్చ

అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంపై పార్ల మెంట్‌లో చర్చ...రచ్చ అయ్యింది. ఈ కుంభకో ణానికి సంభందించి శుక్రవారం కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ లోక్‌సభలో ప్రభుత్వం తరపున ప్రకటన చేశారు. ఈ ప్రకటకతో సభలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్షాలు పరస్పర నినాదాలు, అరుపులు, కేకలతో సభ దద్దరి ల్లింది. దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగిన సభలో విపక్ష కాంగ్రెస్‌ సభ్యలు అసహనం తో వాకౌట్‌ చేశారు. పలు సార్లు ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వైఖరిపై మండిపడ్డారు. శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై చర్చ జరిగింది.

Pages

Subscribe to RSS - May