May

రాజన్‌..ఆర్థిక వ్యవస్థకే ప్రమాదమట

 రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ని ఆ పదవి నుంచి తొలగించాలని భాజపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.రాజన్‌ భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారారని విమర్శించారు.

ఐక్య పోరాటాలతోనే పౌర హక్కులకు రక్షణ

సచివాలయ నిర్మాణ పనుల్లో చట్టాలను అమలు చేయాలని, నిర్భంధాలు వద్దనే డిమాండ్లతో గుంటూరులో రాజకీయ, ప్రజా కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ, తాత్కాలిక రాజధాని పేరుతో కార్మికులతో కార్పొరేట్‌ కంపెనీలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని విమర్శించారు.. రాజధాని నిర్మాణ అంశం ప్రారంభమైనప్పటి నుంచీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులు, దౌర్జన్యాలు చేస్తోందన్నారు.

మోడీపై అచ్చుతానందన్ ఘాటు విమర్శ

కేరళ సీపీఎం కురువృద్ధ నేత, మాజీ సీఎం వీఎస్ అచ్చుతానందన్ తనదైన శైలిలో ప్రధాని నరేంద్రమోదీపై ఘాటు విమర్శలు చేశారు. ఎంతసేపు స్వచ్ఛ భారత్, మరుగుదొడ్ల నిర్మాణం అని చెప్పే మోదీ.. ముందు దేశంలో చాలామందికి తినడానికి తిండి కూడా లేదనే విషయం గుర్తించాలని అన్నారు. అసలు తిండే లేనప్పుడు మరుగుదొడ్డి కట్టుకొని ఏం చేస్తారని ఆయన వినూత్న విమర్శ చేశారు.

అమరావతి రైల్వే లైన్ కోసం సర్వే

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి రైల్వే లైన్ కోసం త్వరలో సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా తెలిపారు. ఈ సర్వే ప్రక్రియ ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పారు.  కృష్ణా పుష్కరాల నేపథ్యంలో రూ. 40 కోట్లతో వసతుల కల్పన చేపట్టనున్నట్లు వెల్లడించారు.

వాగ్దానం చేసిన ఉద్యోగాలెక్కడ

దేశంలో నిరుద్యోగం పెరుగుదల, ఉద్యోగాలు పెరగక పోవటాన్ని గురించి ఈమధ్య కార్పొరేట్‌ మీడియా చర్చ చేస్తున్నది. లేబర్‌ బ్యూరో చేసిన త్రైమాసిక సర్వేలో ఉద్యోగాల పెరుగుదల ఎక్కువగా ఉండే ఎనిమిది రంగాలైన బట్టల పరిశ్రమ, చేనేత వస్త్రాలు, బంగారు నగలు, నూలు ఉత్పత్తి, ఐటి రంగం, తోలు ఉత్పత్తులు, లోహాలు, ఆటోమొబైల్స్‌లలో 2014లో 4,90,000 మందికి, 2009లో 12,50,000 మందికి ఉద్యోగాలుకల్పించగా 2015లో 1,50,000 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించి నట్లుగా వెల్లడి కావటం ఈ చర్చకు తక్షణ కారణం కావచ్చు. గ్రామీణ ఉద్యోగితకు సంబంధించి పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతున్నది.

వివాదాస్పదంగా మోడీ విద్యార్హత

మోడీ గుజరాత్‌ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అతను పూర్తి చేశానని చెబుతున్న ఎంఏ సంపూర్ణ రాజనీతి శాస్త్రం (ఎంటైర్‌ పొలిటికల్‌ సైన్స్‌) అంశం ఆ యూనివర్సిటీ సిలబస్‌లోనే లేదని జయంతీ భారు పటేల్‌ ఆరోపించారు. 'ప్రధాని మోడీ సర్టిఫికెట్లలో పేర్కొన్న ఎంఏ పార్ట్‌-2 పేపర్లలో కూడా చాలా వ్యత్యాసాలు కనపడుతున్నాయి. నాకున్న సమాచారం మేరకు, ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ విద్యార్థులకు అలాంటి సబ్జెక్టులు ఉండవు' అని పటేల్‌ చెప్పారు. 

ఈనెల 17న మోదీతో బాబు భేటి

నరేంద్రమోదీతో ఈనెల 17వ తేదీన సమావేశం కాబోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి విభజన చట్టంలో పొందుపరిచిన నిబంధనలన్నీ అమలు చేయాలని కోరబోతున్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటించినట్టుగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా, ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.24,350 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. రెవిన్యూలోటు భర్తీ, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధుల అంశాన్ని కూడా ప్రధానమంత్రి ముందుంచబోతున్నారు.

311మంది అభ్యర్థులపై నేరారోపణలు

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల్లో 202 మంది కోటీశ్వరులున్నారట. అంతేగాక.. 311 మంది అభ్యర్థులపై నేరారోపణలు ఉన్నట్లు తెలిసింది. అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌), కేరళ ఎన్నికల పరిశీలన కమిటీ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

రాజ్యసభకు జూన్ 11న ఎన్నికలు

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 57 మంది సభ్యుల పదవీ కాలం జూన్-ఆగస్టు మధ్య పూర్తవుతున్నందున జూన్ 11న ఎన్నికల నిర్వహిస్తామని పేర్కొంది. పదవీ విరమణ చేస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు

Pages

Subscribe to RSS - May