
కాపులను బీసీల్లో చేర్చాలని ఉద్యమం చేస్తున్న ముద్రగడ మరోసారి సీఎం చంద్రబాబుకు లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖలో పలు ప్రశ్నలు..పలు విమర్శలు గుప్పించారు. కాపులను బీసీలో చేర్చే చర్యలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పేద కాపులకు రుణాల మంజూరు గురించి ఆలోచించారా ? అని ప్రశ్నించారు. చంద్రన్న కానుకలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత ఆస్తి వివరాలు ఇచ్చినట్లుగా పేర్లు ఏంటనీ ప్రశ్నించారు.