May

బిజెపి ద్రోహంపై టిడిపి వైఖరేంటి?:మధు

ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన బిజెపితో అనుబంధంపై టిడిపి తన వైఖరిని స్పష్టం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాను సాధిస్తామని, రాష్ట్రాభివృద్ధి కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాభిప్రాయం మేరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఇందుకు ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు. విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మధు మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టిడిపి సిద్ధమైతే, సిపిఎం సహకారం అందిస్తుందని చెప్పారు.

CCDMC స్థానే అమరావతి అభివృద్ధి కంపెనీ

రాజధాని ప్రాంత, అమరావతి నగర అభివృద్ధి పనుల ప్రణాళిక, నియంత్రణ అధికారాన్ని ప్రభుత్వం ఎపిసిఆర్‌డిఎకు అప్పగించింది. అమరావతి అభివృద్ధి కంపెనీ (ఎడిసి)గా మారిన రాజధాని నగర అభివృద్ధి, నిర్వహణ సంస్థ (సిసిడిఎంసి)కు 217 చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించిన రాజధాని నగర మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను అప్పగించింది. ఈ మేరకు సిఆర్‌డిఎ ముఖ్య కార్యదర్శి అజరుజైన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సిసిడిఎంసి పేరును అమరావతి అభివృద్ధి కంపెనీ (ఎడిసి)గా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం సూచించింది.

సిపిఎం నేతలను ముందస్తు అరెస్టు..

ముఖ్యమంత్రి పర్యటనలకొచ్చినప్పుడల్లా సిపిఎం నాయకులను ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడం, వారిని పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం ప్రభుత్వ రివాజుగా మారింది. ముఖ్యమంత్రి ఏ జిల్లాకు వెళ్లినా ఇదే పరిస్థితి. తాజాగా గురువారం విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటను దృష్టిలో పెట్టుకొని మళ్లీ అరెస్టుల పర్వం కొనసా గింది.సిపిఎం రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తిసహా పలువురు సిపిఎం నేతలను పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్టు చేశారు. తెల్లవారుజామున ఐదు గంటలకు పోలీసులు కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి ఆయనను ఉన్న పళంగా అరెస్టు చేశారు. ఈ అక్రమాన్ని కుటుంబ సభ్యులు నిలదీసినా పోలీసులు ఆయనను విడిచి పెట్టలేదు.

అమరావతికి ఆ ప్రతిపాదనే లేదు:మనోజ్‌ సిన్హా

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతికి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నడిపే ప్రతిపాదనే రాలేదని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వేస్తున్నారా? అన్న ప్రశ్నకు కేంద్ర రైల్వే సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా పార్లమెంట్‌ సమాధానమిస్తూ ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన రాలేదన్నారు ..

ముగిసిన బెంగాల్‌లో ఎన్నికలు..

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్ని కల ఆరవ, తుదివిడత పోలింగ్‌ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ముగిసింది. తూర్పు మిడ్నపూర్‌, కూచ్‌బెహర్‌ జిల్లాల్లోని 25 నియోజకవర్గాల్లో 6774 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ బూత్‌లకు పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తుదివిడతలో రికార్డు స్థాయిలో 84.24 శాతం పోలింగ్‌ నమోదైంది. 

9వ రోజుకు చేరిన కన్నయ్య నిరాహార దీక్ష

 నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. గురువారం ఉదయం నుంచీ ఆయనకు వాంతులు మొదలయ్యాయి. బీపీ 80/56కు పడిపోయింది. దాదాపు అపస్మారక స్థితిలో సహచర విద్యార్థులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయన శరీరం లోపలి అవయవాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు భావిస్తున్నారు. ఆహారం తీసుకోకపోతే అంతర్గత రక్తస్రావానికి దారితీయొచ్చని డాక్టర్లు హెచ్చరించారు. కాగా, తనకేం జరిగినా ఫర్వాలేదు కానీ దీక్ష విరమించేది లేదని కన్నయ్య స్పష్టం చేసినట్టుగా సమాచారం. 

PDF సరైన ప్రత్యామ్నాయం:బృందా

తమిళనాట డి.ఎం.కె, ఎ.ఐ.ఎ.డి.ఎం.కె లకు సరైన ప్రత్యామ్నాయం ప్రజా సంక్షేమ కూటమేనని (పిడబ్ల్యుఎఫ్‌) సి.పి.యం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా బుధవారంనాడు మధురైలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న బృంద సభకు తమ అభ్యర్థులను పరిచయం చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ విధమై న అవినీతి ఆరోపణలు లేని, ఉమ్మడి భావజాలం కలిగిన వారితో తొలిసారిగా ఏర్పడిన కూటమి పిడబ్ల్యుఎఫ్‌ అని, నాలుగు దశాబ్దాలుగా అనేక కీలక రంగాలలో విఫలమైన తమిళనాడును పునర్నిర్మించాలన్న లక్ష్యంతో ఏర్పడిందని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు:జైట్లీ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదర దంటూ కేంద్రం వరుసగా ప్రకటనలు మీద ప్రకట నలు గుప్పిస్తోంది. కేంద్ర హోం సహాయ మంత్రి హె చ్‌పి చౌదరి, కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్‌ సిన్హా ఇచ్చిన ప్రకటనలతో షాక్‌ తిన్న ఆంధ్రప్రదేశ్‌కు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మరో షాక్‌ ఇచ్చారు. ఏపికి ప్రత్యేక హోదా వుండదని నేరుగా చెప్పకపోయినా పునర్విభజన చట్టం ప్రకారం ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇప్పటికే ఇచ్చేశామన్నారు. ఇంకా ఇవ్వాల్సినవేమైనా వుంటే అవి కూడా పైసాతో సహా ఇచ్చేస్తామని అన్నారు.

బ్రాండిక్స్ కార్మికులకు బరోసా..

గత నెల రోజులుగా అక్కడ కనీస సౌకర్యాలు, వేతనాలు, ఫిఎఫ్ ,ఇఎస్ఐ కోసం జరుగుతున్న ఆందోళనలో వేడి ఎక్కడ తగ్గడం లేదు..రోజు పోలీసుల అరెస్టులు, మహిళల ఆందోళనలు, ధర్నలు వివిధ ప్రజాసంఘాల సంఘీభావాలు, వివిధ పార్టీల సపోర్టులు..ఇది ఇప్పుడు బ్రాండిక్స్ దగ్గర పరిస్ధితి.. బ్రాండిక్స్ లో లో ఆందోళన చేస్తున్న కార్మికులకు మేము అండగా ఉన్నమంటూ వామపక్షలు కదిలాయి. ఈరోజు బ్రాండిక్స్ కార్మికులు నివాసముండే పూడిమడక, తిమ్మరాజుపేట, హరిపాలెం గ్రామాలు, బ్రాండిక్స్ ప్యాక్టరీ లను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. సమస్యలు అడిగితెలుసుకున్నారు. కార్మికులతో మమైక మైయ్యారు. సమస్యలపై పోరాటబావుట ఎగువవేస్తామని కార్మికులకు తెలిపారు..

Pages

Subscribe to RSS - May