
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నడిపే ప్రతిపాదనే రాలేదని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్ వేస్తున్నారా? అన్న ప్రశ్నకు కేంద్ర రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా పార్లమెంట్ సమాధానమిస్తూ ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన రాలేదన్నారు ..