కమ్యూనిస్టులు బలపడితేనే భారతదేశ పురోగతి, అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. పెదనందిపాడు మండలంలోని పాలపర్రులో ఆదివారం పాత బాపట్ల తాలూకా మృతవీరుల స్మారక సభ నిర్వహించారు. ముందుగా జడ్‌పి పాఠశాల నుంచి అమరవీరుల స్థూపం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీరతెలంగాణ సాయుధ పోరాటంలో నేలకొరిగిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. భూమికోసం భుక్తి కోసం బడుగు, బలహీనులు సాగించిన పోరాటంలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు.