పుచ్చలిపల్లి సుందరయ్య స్ఫూర్తితో దోపిడీ, పీడనలేని సమాజం కోసం ప్రజలంతా ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి పిలుపు నిచ్చారు. విజయనగరం పట్టణంలోని ఎల్‌బిజి నగర్‌లో సుందరయ్య వర్థంతి సభను గురువారం నిర్వహించారు. నాయకులు పి.రమణమ్మ అధ్యక్షతన అనంతరం జరిగిన సభలో కృష్ణమూర్తి మాట్లాడారు. సుందరయ్య సంపన్న కుటుంబలో పుట్టినప్పటికీ సమాజంలో కులతత్వాన్ని, దోపిడీని చిన్నప్పుడే వ్యతిరేకించారన్నారు. పేదలు, కష్టజీవులు, సామాన్యులు, మహిళలు ఆత్మగౌరవంతో బతికే వ్యవస్థ కోసం కృషి చేశారన్నారు. ప్రతిఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ అందాలన్న లక్ష్యంతో చివరి వరకూ పనిచేశారని చెప్పారు.