రఘువీరా సహా కాంగ్రెస్‌ నేతల అరెస్టు

కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మించ తలపెట్టిన వివాదాస్పద రంగారెడ్డి -పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో నిర్వహించిన మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. ప్రకాశం బ్యారేజీ వద్దకు ర్యాలీగా బయలుదేరిన నాయకులను పోలీసులు అడుగడుగునా అరెస్టులు చేశారు. దీంతో విజయవాడ అలంకార్‌ కూడలి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు రణరంగంలా మారింది. బ్యారేజీ సందర్శనకు అనుమతి లేదంటూ వందలాది మంది పోలీసులు నాయకులను అడ్డుకున్నారు.