
నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. గురువారం ఉదయం నుంచీ ఆయనకు వాంతులు మొదలయ్యాయి. బీపీ 80/56కు పడిపోయింది. దాదాపు అపస్మారక స్థితిలో సహచర విద్యార్థులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయన శరీరం లోపలి అవయవాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు భావిస్తున్నారు. ఆహారం తీసుకోకపోతే అంతర్గత రక్తస్రావానికి దారితీయొచ్చని డాక్టర్లు హెచ్చరించారు. కాగా, తనకేం జరిగినా ఫర్వాలేదు కానీ దీక్ష విరమించేది లేదని కన్నయ్య స్పష్టం చేసినట్టుగా సమాచారం.