కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామని వామపక్ష నాయకులు స్పష్టం చేశారు. బ్రాండిక్స్ కార్మికులకు మద్దతుగా బుధవారం అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట, హరిపాలెం, పూడిమడక గ్రామాల్లో వారు పర్యటించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి ఏజెంటుగా పని చేస్తున్నారని, జీతాలు పెంచమంటే నాలుగైదు నెలలు పడుతుందని చెబుతున్నారని తెలిపారు.