ఢిల్లీలో లోక్‌తంత్ బచావో యాత్ర

 ప్రధాని మోదీ ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేడు ఢిల్లీలో లోక్‌తంత్ బచావో యాత్ర పేరుతో ర్యాలీని చేపట్టింది. అనంతరం జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షను నిర్వహించింది. దీక్షలో పాల్గొన్న రాహుల్‌గాంధీ ఈ సందర్భంగా మాట్లాడారు. రోజుకు దేశవ్యాప్తంగా 50 మంది రైతులు ఆత్మహత్య మోదీ అచ్చేదిన్ ఆయేగా అంటే ఇదేనా అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. 40 శాతం భూభాగం కరువుతో అల్లాడుతోందన్నారు.