కృష్ణా పుష్కరాల పేరు చెప్పి ఘాట్‌ను నిర్మిస్తామని, ప్రజల ఇబ్బందును తొలగించేందుకు ఇళ్ళు తొలగించాల్సి వస్తుందని మాయమాటలు చెబుతున్న తెలుగుదేశం ఈ ప్రాంతంలో పర్యాటక రంగం పేరుతో సింగపూర్, జపాన్‌కంపెనీల వ్యాపారాల కోసం పేదల ఇళ్ళు కూల్చడం అన్యాయం. వెంటనే ఈ చర్యలు వెనక్కి తీసుకోవాలని కోరుతూ కరకట్టవాసులు శుక్రవారం ఉదయం సైన్స్‌సెంటర్ వద్ద పెద్దఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు శ్రీ సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ కృష్ణాపుష్కరాలకు నిజంగా ఇళ్ళు తొగించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే కరకట్ట వాసు ఇళ్ళకు కృష్ణానదికి మధ్యలో పున్నమీ హోటల్, సైన్స్ సెంటర్, ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌ు మరియు స్థలాలు ఉన్నాయి. అవన్నీ అడ్డంకానప్పుడు పేద ఇళ్ళు మాత్రమే ఎందుకు అడ్డమవుతాయని ప్రశ్నించారు. ఇది కేవం టూరిజం పేరుతో విదేశీ కార్పొరేట్ శక్తుల వ్యాపారాల కోసం పేదల ఇళ్ళు క్చూడేనని విమర్శించారు. దీనికకి ప్రభుత్వం, చంద్రబాబు దళారీగా వ్యవహరిస్తున్నారని దూయబట్టారు. నిన్న.,మొన్నటి దాకా మీ ఇళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ వద్ద ఎన్.టి.ఆర్. ఇచ్చి పట్టాలున్నాయి కాబట్టి ఎటువంటి పరిస్థితితుల్లో తీయమని హామీలిచ్చిన టిడిపి ప్రజాప్రతినిధులు, నాయకులు ఏమమయ్యారని ప్రశ్నించారు. గత మూడు నాలుగు రోజులనుండి ఇళ్ళు తొలగిస్తామని అధికారులు భయపెడుతున్నా ఒక నాయకుడూ, ప్రజాప్రతినిధి ఒక్కడూ పట్టించుకోకపోవడం ప్రజలను మోసం చేయడమే అవుతుందన్నారు. ఇప్పటికైనా ముందుకొచ్చి నిజానిజాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా పుష్కరాలకు,యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఏమైనా కొన్ని ఇళ్ళు తొగించాల్సి వస్తే వాటికి అభ్యంతం ఉండదు, అదే సందర్భంలో ఫ్లైఓవర్ వద్ద తొగించిన ఇళ్ళకు ఇచ్చిన నష్టపరిహారాన్ని ఇక్కడ కూడా అము చేయాని డిమాండ్ చేశారు. ప్రజందరూ ఐక్యంగా వుండి తమ ఇళ్ళు నిలుపుకునేందుకు జరిగే పోరాటంలో కలిసి రావాలని కోరారు.