కేరళ అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ భారీ తిరుగులేని విజయం సాధించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోభాగంగా ఈ నెల 16న జరిగిన 14వ అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ 91 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యుడిఎఫ్)47 స్థానాలను గెలుచుకుంది.