హామీ లభిస్తేనే భారత్‌కు తిరిగొస్తా!

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాల తిరిగి చెల్లింపు విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్‌ అధినేత విజరు మాల్యా భారత్‌కు వచ్చేందుకు పూర్తి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. గత శుక్రవారం ముంబయిలో జరిగిన 'యునైటెడ్‌ బ్రూవరీస్‌' (యూబీఎల్‌) బోర్డు సమావేశంలో మాల్యా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన భద్రతకు, స్వేచ్ఛకు హామీ లభిస్తే భారత్‌కు తిరిగి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారని తెలుస్తోంది. ఈ సమావేశంలో మాల్యా మాట్లాడుతూ కింగ్‌ఫిషర్‌ రుణాల విషయంలో తాను అనివార్య పరిస్థితుల్లో బాధితుడిగా మారాల్సి వచ్చిందని చేసినట్టు బోర్డు డైరెక్టర్లు కొందరు వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడే ఉద్దేశంతోనే తాను ఉన్నట్టుగా మాల్యా ఈ సమావేశంలో తెలిపారన్నారు.