దామాషా పద్ధతిలో నీటివాటా రావాలి..

కృష్ణా, గోదావరి నదులపై ఎగువన తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్‌ ఎడారిగా మారుతుందని వైసీపీ అధ్యక్షులు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలో మూడు రోజుల పాటు చేపట్టే జలదీక్షను సోమవారం నంద్యాల చెక్‌పోస్టు దగ్గర వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు గౌరు వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో జగన్‌ మాట్లాడారు. ఒక్క నీటి బొట్టు కూడా అక్రమంగా మళ్లింపునకు గురి కాకుండా 15 రోజులకోసారి నీటిని సర్దుబాటు చేసేలా దామాషా పద్ధతిలో నిబంధన ఉండాలన్నారు. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులపై కేంద్రం తక్షణమే స్పందించాలని, లేకపోతే విద్వేషాలు పెరిగే అవకాశముందన్నారు. ఈ జలదీక్షతో చంద్రబాబు, కెసిఆర్‌లకు జ్ఞానోదయం కలగాలన్నారు. తానొక్కడినే ఆందోళన చేస్తే సరిపోదని, అందరూ కలిసి రావాలని కోరారు.