న్యాయవ్యవస్థ లక్ష్మణరేఖ గీసుకోవాలి:జైట్లీ

న్యాయ వ్యవస్థ తనకు తాను లక్ష్మణరేఖ గీసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ సూచించారు. స్వతంత్రత పేరుతో ఇతర విభాగాల్లో జోక్యం చేసుకోవడం తగదని జైట్లీ అన్నారు. చట్టాల ను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందని, అయితే..విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం శాసన వ్యవస్థదేనని ఆయన స్పష్టం చేశారు.