February

'అనంత' సమస్యలపై నిలదీద్దాం

నిత్యమూ కరువు దుర్భిక్షానికి నిలయమైన అనంతపురం జిల్లా సమస్యలపై నిలదీసేందుకు తమతో కలసి రావాలని సిపిఎం, సిపిఐ ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. రాయలసీమ వెనుకబాటుతనంపై రెండు పార్టీలు సంయుక్తం చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం రాత్రికే కదిరి పట్టణానికి చేరుకుంది. శనివారం ఉదయం కదిరి పట్టణంలో ప్రారంభమైన బస్సు యాత్ర ఓబుళదేవరచెరువు, నల్లమాడ, బుక్కపట్నం మీదుగా రాత్రికి పుట్టపర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు బస్సుయాత్ర వెళ్లిన సందర్భంలో స్థానిక నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.

రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి

 రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు. శుక్రవారం స్థానిక కళాజ్యోతి సర్కిల్‌ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జీపుజాత ధర్మవరం నుంచి గొల్లపల్లి, ఉప్పునేసినపల్లి, చిగిచెర్ల, ముష్టూరు, బత్తలపల్లి, తాడిమర్రి, రామాపురం మీదుగా ముదిగుబ్బకు చేరుకుని అక్కడినుంచి ధర్మవరానికి చేరుకుంటుందన్నారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాయలసీమను పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు.

సీమ అభివృద్ధి కోసం ఉధృత పోరాటాలు

రాయలసీమ అభివృద్ధి కోసం ఉధృత పోరాటాలు చేయనున్నట్లు సిపిఎం, సిపిఐ నాయకులు తెలిపారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలోని పుట్టపర్తి, ఓబుళదేవరచెరువు, నల్లమాడ, బుక్కపట్నం మండలాల్లో కొనసాగింది. 

అనంత' సమస్యలపై నిలదీద్దాం

నిత్యమూ కరువు దుర్భిక్షానికి నిలయమైన అనంతపురం జిల్లా సమస్యలపై నిలదీసేందుకు తమతో కలసి రావాలని సిపిఎం, సిపిఐ ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. రాయలసీమ వెనుకబాటుతనంపై రెండు పార్టీలు సంయుక్తం చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం రాత్రికే కదిరి పట్టణానికి చేరుకుంది. శనివారం ఉదయం కదిరి పట్టణంలో ప్రారంభమైన బస్సు యాత్ర ఓబుళదేవరచెరువు, నల్లమాడ, బుక్కపట్నం మీదుగా రాత్రికి పుట్టపర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు బస్సుయాత్ర వెళ్లిన సందర్భంలో స్థానిక నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.

పిడికెడుమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే ముఖ్యమా : సిపిఎం

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="" style="color: rgb(68, 68, 68); font-family: Mandali; font-size: 16px; line-height: 28.8px; text-align: justify;">భూహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పు లింగరాజు అధ్యక్షతన వచ్చేనెల 9వ తేదీన విజయవాడలో నిర్వహించే ధర్నాలో పాల్గొని జిల్లా ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణకు నిరసన తెలియజేయాలని తీర్మానం ప్రవేశపెట్టగా, సదస్సులో ఏకగ్రీవంగా ఆమోందమైంది.

ప్రశ్నిస్తేనే దేశద్రోహమా?:ఏచూరి

జేఎన్‌యు, హెచ్‌సియు ఘటనలపై ప్రభుత్వ తీరును సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే అది దేశద్రోహమా అని ప్రశ్నించారు. దేశభక్తి గురించి మాకు మీరు నేర్పాల్సిన అవసరం లేదని ఘాటుగా అన్నారు.

ఆర్థికసర్వే ప్రవేశపెట్టిన జైట్లీ

 2016-17 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనా 7 నుంచి 7.5శాతంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. లోక్‌సభలో ఎకానమిక్ సర్వే రిపోర్టు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ సమర్పించారు. 2015-16లో వృద్ధిరేటు ఆశించిన స్థాయిలో లేనప్పటికి.. జీడీపీలో ద్రవ్యోలోటును 3.9శాతానికి తగ్గిస్తామని నివేదికలో పేర్కొంది. 

సీమకు లక్షకోట్ల ప్యాకేజీ ఇవ్వాలి

రాయలసీమకు తక్షణమే లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం వామపక్షాలు చేపట్టిన బస్సు యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన హక్కు చట్టంలో పేర్కొన్న విధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. వెనుకబడిన రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

బడ్జెట్ లో ఏపికి మొండిచేయి

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించిందని సిపిఎం తెలిపింది. కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు ఒక్కటి కూడా రైల్వే బడ్జెట్‌లో ప్రతి పాదించకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేయ డాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న రైల్వే జోన్‌ ఏర్పాటు గురించి మాటమాత్రమైనా ప్రస్తావించక పోవడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు  విమ ర్శించారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసం వామపక్షాల ర్యాలీ

దేశంలో నెలకొన్న అసహనాన్ని నిరసిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు సాగిన ఈ ర్యాలీలో సిపిఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఒ.నల్లప్ప, సిపిఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శి పెద్దన్న, సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్లప్రభాకర్‌ రెడ్డి, ఎస్‌యుసిఐ రాష్ట్ర నాయకురాలు లలితమ్మ, ఆర్‌ఎస్‌పి నాయకులు బాషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

Pages

Subscribe to RSS - February