February

పాదయాత్ర బృందానికి సమస్యల వెల్లువ

యడ్లపాడు మండలంలో దళితులు సాగు చేసుకునే భూములు ఆక్రమణలకు గురయ్యాయని, శ్మశాన స్థలాలు లేక దళితులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఈ సమస్యలపై ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. దళితుల సమస్యపై నిర్వహిస్తున్న పాదయాత్ర బుధవారానికి మూడో రోజుకు చేరింది. యాడ్లపాడులో ప్రారంభమైన యాత్ర కారుచోల, ఉన్నవ, వంకాయపాడు, ఉప్పరపాలెం, లింగారావుపాలెం, కొత్తసొలస, పాత సొలస, కొండవీడు, ఛంగీజ్‌ఖాన్‌పేట, సంగం, బోయపాలెం తదితర గ్రామాల్లో దళితవాడల్లో సమస్యలను అధ్యయనం చేశారు.

సామాన్లు తీసుకుంటుంటే కూల్చేశారు

సామాన్లు సద్దుకుంటామన్నా ఆగకుండా ప్రొక్లేయిన్ల్‌తో మున్సిపల్‌ అధికారులు, పోలీసు సిబ్బంది ఇళ్లను కూల్చివేయించారని వావిలాలఘాట్‌ వాసులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వావిలాల్‌ఘాట్‌ వాసులు సామన్లు సద్దుకుంటుం డంగానే మంగళవారం సాయంత్రం పోలీసులు బందోబస్తుతో మున్సిపల్‌ అధికారులు వారి ఇళ్లను నేల మట్టం చేసిన విషయం విధితమే. వావిలాలఘాట్‌ పార్క్‌ అభివృద్ధికి వావిలాలఘాట్‌లో నివాసం వుంటున్న 102 కుటుంబాల ఇళ్లను పీకివేసి ఎస్‌పిజి డిగ్రీకళాశాల్లో చూపించిన ప్రత్యామ్నాయ స్థలానికి వెళ్లి ఇళ్లు అక్కడవేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆంజనేయులకు ప్రాణం పోశారు

అంకితభావం, వృత్తి నైపుణ్యంతో జిజిహెచ్‌ వైద్యులు అద్భుత రీతిలో శస్త్రచికిత్సలతో చేసి, అరుదైన స్దితిలో వ్యక్తికి ప్రాణం పోయడం సర్వత్రా హర్షణీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అభినందించారు. రౌడీషీటర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో జిజిహెచ్‌లో చేరిన సిపిఎం శాఖ కార్యదర్శి ఆంజనేయులు గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అత్యంత తీవ్రత కలిగిన ముఖంపై గాయాలతో మరణం అంచున నిలిచిన ఆంజనేయులుకు జిజిహెచ్‌లోని వివిధ విభాగాల వైద్య నిపుణులు శ్రమించి అరుదైన శస్త్రచికిత్సలు చేయడంతో ఆంజనేయులు బతికి బయటపడ్డారని పేర్కొంటూ సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు వైద్య నిపుణులకు ఘనసత్కారం చేశారు.

అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్ర‌మాద‌క‌రం

కొవ్వాడ అణుపార్కు భూసేక‌ర‌ణ‌ను ప్ర‌తిఘ‌టిండి
అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్ర‌మాద‌క‌రం
---సిఐటియు రాష్ట్ర ఉపాధ్య‌క్షులు సి.హెచ్‌.న‌ర్సింగ‌రావు

ఇరానీపై అట్టుడికిన పార్లమెంట్‌..

స్మృతిఇరానీ అంశంతోపాటు, కేంద్ర సహాయ మంత్రి రామ్‌శంకర్‌ కటారియా 'విద్వేష' ప్రసంగం, ఎయిర్‌సెల్‌- మ్యాక్సెస్‌ వ్యవహారం ఉభయసభలను కుదిపేశాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు అన్నాడిఎంకె సభ్యులు ఆందోళనకు దిగడంతో లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు అడుగుముందుకు పడకుండా బుధవారానికి వాయిదా పడ్డాయి. హెచ్‌సీయూ, జేఎన్‌యూ వ్యవహారంలో హెచ్‌ఆ ర్‌డి మంత్రి స్మృతిఇరానీపై 'తప్పుడు ఆధారాల అంశం'పై కాంగ్రెస్‌తో పాటు వామపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.

Pages

Subscribe to RSS - February