February

రైవాడ నీటి కోసం సంఘటిత పోరాటం

 రైవాడ నీరు రైతులకు పునరంకితం అయ్యే వరకూ రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం సాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పిలుపునిచ్చారు. రైవాడ నీరు రైతులకు ఇవ్వాలని కోరుతూ రైవాడ ఆయకట్టుదారుల నీటి సాధన కమిటీ ఆధ్వర్యాన ఈ నెల 14న ప్రారంభమైన పాదయాత్ర గురువారం విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం, ఆనందపురంలో ముగిసింది. ఈ సందర్భంగా సాధన కమిటీ అధ్యక్షులు వేచలపు చినరామునాయుడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో లోకనాథం మాట్లాడారు. రైవాడ నీటిని సాధించేందుకు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొనే సమయం ఆసన్నమైందని, ఇందుకు ఆయకట్టుదారులు సిద్ధం కావాలన్నారు.

దివీస్‌ విస్తరణ పనుల నిలిపివేతకు ఆందోళన

 విశాఖ జిల్లా, భీమిలి మండలంలో వున్న  దివీస్‌ కంపెనీ మూడో యూనిట్‌ నిర్మాణ పనులు నిలిపివేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించింది. భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ సిటీనగర్‌ ఆటోస్టాండ్‌ నుంచి ప్రారంభమై దివీస్‌ కంపెనీ వరకు సాగిన ప్రదర్శనలో ఆశపాలెం, కొసవానిపాలెం, కంచేరుపాలెం, చిప్పాడ, మూలకొద్దు, నమ్మివానిపాలెం, పెదనాగమల్లిపాలెం, అన్నవరం తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రజలను చీల్చి తమ పనులు చక్కదిద్దుకోవాలన్న యాజమాన్య కుయుక్తులను పసిగట్టిన ఉద్యమ కమిటీ అడ్డుకుంది.

దివీస్‌ విస్తరణ పనుల నిలిపివేతకు ఆందోళన

 విశాఖ జిల్లా, భీమిలి మండలంలో వున్న  దివీస్‌ కంపెనీ మూడో యూనిట్‌ నిర్మాణ పనులు నిలిపివేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించింది. భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ సిటీనగర్‌ ఆటోస్టాండ్‌ నుంచి ప్రారంభమై దివీస్‌ కంపెనీ వరకు సాగిన ప్రదర్శనలో ఆశపాలెం, కొసవానిపాలెం, కంచేరుపాలెం, చిప్పాడ, మూలకొద్దు, నమ్మివానిపాలెం, పెదనాగమల్లిపాలెం, అన్నవరం తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రజలను చీల్చి తమ పనులు చక్కదిద్దుకోవాలన్న యాజమాన్య కుయుక్తులను పసిగట్టిన ఉద్యమ కమిటీ అడ్డుకుంది.

పెద్ద‌ల‌కు దోచిపెడుతున్న ప్రభుత్వం: బాబూరావు

రాజధానిలో భూ కుంభకోణాను ప్రభుత్వం చట్టబద్ధం చేస్తోంది.  పేద‌ల‌ను న‌ట్టేట ముంచి పెద్ద‌ల‌కు దోచిపెట్టేందుకు ప్ర‌భుత్వం పూనుకుంది. లంక‌భూముల వ్య‌వ‌హారంలో బ‌హిర్గ‌త‌మయింది.  అసైన్డ్‌, లంక, ఫారెస్ట్‌ భూములు అమ్మడానికి వీల్లేదని చెప్పి దళితులు, పేదల‌ను భయపెట్టి పెద్దలు భూము కొనుగోలు చేశారు.  న‌ష్ట‌పరిహారం కూడా ఇవ్వబోమని చెప్పడంతో పేదలు భయపడి భూముల‌ను తక్కువ ధరకు అమ్ముకున్నారు.  కొనుగోళ్లు పూర్త‌యిన త‌రువాత  జిఓ నెంబరు 41 విడుదల చేసి వాటిని చట్టబద్ధం చేసి పెద్ద‌ల‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్య‌క్షంగా తోడ్ప‌డింది.

విశాఖలో పెట్రోవర్సిటీకి పర్మిషన్..

 విశాఖలో పెట్రోలియం వర్సిటీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏయూ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించేందుకు ఆంధ్రా యూనివర్సిటీతో మూడేళ్లకు కేంద్ర పెట్రోలియం సహజవనరుల శాఖ ఒప్పందం చేసుకుంది.

ఏబీవీపీ JNU నేత‌ల రాజీనామా..

ఏబీవీపీ జేఎన్యూ నేత‌లు రాజీనామా బాట ప‌ట్టారు. తాజా వివాదంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ విధానాల‌తో విబేధించిన ముగ్గురు కీల‌క నేత‌లు త‌మ రాజీనామాలు స‌మ‌ర్పించారు. ఏబీవీపీ స‌హాయ కార్య‌ద‌ర్శి ప్ర‌దీప్ నార్వాల్, క్యాంప‌స్ లోని ఓ యూనిట్ కి ప్రెసిడెంగా ఉన్న రాహుల్ యాద‌వ్, కార్య‌ద‌ర్శి అకింత్ హాన్స్ లు త‌మ ప‌ద‌వుల‌తో పాటు ఏబీవీపీ కి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

JNUSUనేతకు మద్దతుగా చెన్నైలో ఆందోళన..

జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌కు మద్దతుగా తమిళనాడు రాజధాని చెన్నైలో ఈరోజు ఆందోళనలు చేశారు. కన్నయ్య అరెస్టు, ఆయనపై న్యాయవాదుల దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆందోళన చేస్తున్న 57 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

రామ‌వ‌ర‌ప్పాడు కాలువ క‌ట్ట‌ల‌పై పేద‌ల ఇళ్ళ‌ను తొల‌గిస్తే ఊరుకోం... స‌ర్వే నిలిపివేయాల‌ని, లేని ప‌క్షంలో సి.ఎం. ఆఫీసు, క‌లెక్ట‌ర్ కార్యాల‌యాలు ముట్ట‌డిస్తామ‌ని హెచ్చ‌రిక‌.

సంఘ్ గుప్పెట్లో వర్సిటీలు..

దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలనూ తన గుప్పిట్లో పెట్టుకునేందుకు సంఫ్‌ు పరివార్‌ ప్రయత్నిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జెఎన్‌యు విద్యార్థి నాయకులను దేశ ద్రోహం కింద అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడి చేయటం మతోన్మాద చర్యేనని విమర్శించారు. బిజెపి పరివార్‌ చర్యలపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్‌ చేశారు. 

మొండిబకాయిలపై సుప్రీం దృష్టి

దేశంలో మొండిబకాయిలపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు, ఆర్ధిక సంస్థలకు 500 కోట్లకు పైగా బాకీ పడ్డవారి జాబితాను తమకు పంపించాలని సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాకు కోరింది. 6 వారాల గడువు విధించింది. వివరాలతో పాటు అఫిడవిట్‌ను కూడా పంపించాలని సూచించింది. అదే విధంగా గత ఐదేళ్లలో మాఫీ చేయబడిన భారీ మొత్తాలకు సంబంధించిన వివరాలను కూడా సుప్రీంకోర్టు కోరింది. ఈ వివరాలను సీల్డ్ కవర్‌లో తమకు అందించాలని సుప్రీం ఆర్‌బీఐని కోరింది. 

Pages

Subscribe to RSS - February