
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య, జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య అరెస్ట్, పఠాన్‌కోట్ దాడి అంశాలు పార్లమెంట్‌ను కుదిపేసే అవకాశముంది. విపక్షాల అసహనానికి ప్రభుత్వ పక్షం సహనం వహించే ప్రయత్నానికి మధ్య కురుక్షేత్ర సంగ్రామం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చే జీఎస్టీ బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్రం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.