February

వామపక్ష శక్తుల విచ్ఛిన్నం ఆర్‌ఎస్‌ఎస్‌ తరం కాదు. - రామారావు

అభ్యుదయ, వామపక్ష శక్తులను విఛ్చిన్నం చేయటం ఆర్‌ఎస్‌ఎస్‌ తరం కాదని, పేద, ధనిక తారతమ్యాలు ఉన్నంత కాలం ఆయా శక్తులుంటాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి దాడిని నిరశిస్తూ ఆదివారం నగర పార్టీ కార్యాలయం నుండి శంకర్‌ విలాస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఢిల్లీలోని జెఎన్‌యు ఎంతో మంది మేధావుల్ని, దేశానికి నాయకుల్ని అందించిందన్నారు.

ప్రజాస్వామ్యంపై దాడే

        సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా శ్రీకాకుళం నగరంలో సిపిఎం ఆధ్వర్యాన ఆదివారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. నగరంలోని డేఅండ్‌నైట్‌ కూడలి నుంచి ఆర్‌టిసి కాంప్లెక్సు వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జమలయ్య మాట్లాడుతూ సిపిఎం కేంద్రం కార్యాలయంపై దాడులను సహించేది లేదన్నారు. భవిష్యత్తులో మతోన్మాద శక్తులకు ప్రజలే ఘోరి కడతారని హెచ్చరించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటాన్ని ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. మతోన్మాద మత్తులో ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి గూండాలు దాడి చేయడం హేయనీయమన్నారు.

సిపియం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి దాడిని ఖండించండి.

సిపియం కేంద్ర కార్యాలయంపై ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దుండగల దాడిని సిపియం విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఘటనను ప్రజాతంత్రవాదులు, అభ్యుదయవాదులు, మేధావులు ఖండించాలని  కోరుతున్నాం.

సింగ‌పూర్‌కు దాసోహం..

సింగ‌పూర్‌కు దాసోహమంటే స‌హించం.....వ్య‌వ‌సాయ ప‌రిర‌క్ష‌ణ జోన్‌పై అవ‌గాహ‌న లేని మంత్రులు. 
మాస్ట‌ర్‌ప్లాన్‌లో స‌మూన మార్పులు చేయ‌క‌పోతే ఐక్య ఉద్య‌మాలు.
ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించిన వారిని రాజ‌ధాని వ్య‌తిరేకులా చూడ‌టం  త‌గ‌దు.

సింగ‌పూర్‌కు దాసోహం... వ్య‌వ‌సాయ ప‌రిర‌క్ష‌ణ జోన్‌పై అవ‌గాహ‌న లేని మంత్రులు. సింగపూర్ పెత్త‌నాన్ని స‌హించేది లేదు. మాస్ట‌ర్‌ప్లాన్‌లో స‌మూన మార్పులు చేయ‌క‌పోతే ఐక్య ఉద్య‌మాలు. ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించిన వారిని రాజ‌ధాని వ్య‌తిరేకుల చూడ‌టం త‌గ‌దు.

రౌడి మూక‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలిః- ఉమామ‌హేశ్వ‌ర‌రావు

సుంద‌ర‌య్య కాల‌నీ పార్టీ శాఖ కార్య‌ద‌ర్శి కామిశెట్టి ఆంజినేయులు,భ‌వ‌న నిర్మాణ కార్మికుడు ఎ స‌తీష్‌ల పై హత్యాయ‌త్నం చేసిన రౌడి మేక‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, సుంద‌ర‌య్య కాల‌నీ పేద‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని సిపియం రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ‌స‌భ్యులు వి.ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. హాస్పిట‌ల్ చికిత్స పొందుతున్న ఆంజినేయులు, స‌తీష్‌ల‌ను ప‌రామ‌ర్శించారు.

ఏపీ సర్కార్ కొత్త నాటకం..

రాజధాని కోసమంటూ వేల ఎకరాల జరీబు భూములను సమీకరించిన ప్రభుత్వం....ఇప్పుడు అగ్రిజోన్‌ అంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది. అప్పుడు సిరులు పండించే భూములే లాక్కుని, ఇప్పుడు వ్యవసాయ పరిరక్షణ కోసమేనంటూ రైతుల నోట్లో మట్టి కొడుతోంది.

పాల కేంద్రాలు ప్రైవేట్‌పరం..

 రాష్ట్రంలోని సహకార పాల కేంద్రాలను ప్రైవేట్‌పరం చేయవద్దని ఐద్వా డిమాండ్‌ చేసింది.. ప్రైవేటు కంపెనీలు పాల ఉత్పత్తులను అమ్మడం మొదలు పెడితే సహకార సంఘాలు కుదేలవుతాయని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం పొందేందుకు, ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యం కిందికి సంఘాలను తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ఆలోచనని వారు పేర్కొన్నారు. పాల కల్తీ, ధరల నియంత్రణ వీలు పడదని, పాల ధరలకూ రెక్కలొచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. 

Pages

Subscribe to RSS - February