February

సింగ‌పూర్‌కు దాసోహం..

సింగ‌పూర్‌కు దాసోహమంటే స‌హించం.....వ్య‌వ‌సాయ ప‌రిర‌క్ష‌ణ జోన్‌పై అవ‌గాహ‌న లేని మంత్రులు. 
మాస్ట‌ర్‌ప్లాన్‌లో స‌మూన మార్పులు చేయ‌క‌పోతే ఐక్య ఉద్య‌మాలు.
ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించిన వారిని రాజ‌ధాని వ్య‌తిరేకులా చూడ‌టం  త‌గ‌దు.

సింగ‌పూర్‌కు దాసోహం... వ్య‌వ‌సాయ ప‌రిర‌క్ష‌ణ జోన్‌పై అవ‌గాహ‌న లేని మంత్రులు. సింగపూర్ పెత్త‌నాన్ని స‌హించేది లేదు. మాస్ట‌ర్‌ప్లాన్‌లో స‌మూన మార్పులు చేయ‌క‌పోతే ఐక్య ఉద్య‌మాలు. ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించిన వారిని రాజ‌ధాని వ్య‌తిరేకుల చూడ‌టం త‌గ‌దు.

రౌడి మూక‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలిః- ఉమామ‌హేశ్వ‌ర‌రావు

సుంద‌ర‌య్య కాల‌నీ పార్టీ శాఖ కార్య‌ద‌ర్శి కామిశెట్టి ఆంజినేయులు,భ‌వ‌న నిర్మాణ కార్మికుడు ఎ స‌తీష్‌ల పై హత్యాయ‌త్నం చేసిన రౌడి మేక‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, సుంద‌ర‌య్య కాల‌నీ పేద‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని సిపియం రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ‌స‌భ్యులు వి.ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. హాస్పిట‌ల్ చికిత్స పొందుతున్న ఆంజినేయులు, స‌తీష్‌ల‌ను ప‌రామ‌ర్శించారు.

ఏపీ సర్కార్ కొత్త నాటకం..

రాజధాని కోసమంటూ వేల ఎకరాల జరీబు భూములను సమీకరించిన ప్రభుత్వం....ఇప్పుడు అగ్రిజోన్‌ అంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది. అప్పుడు సిరులు పండించే భూములే లాక్కుని, ఇప్పుడు వ్యవసాయ పరిరక్షణ కోసమేనంటూ రైతుల నోట్లో మట్టి కొడుతోంది.

పాల కేంద్రాలు ప్రైవేట్‌పరం..

 రాష్ట్రంలోని సహకార పాల కేంద్రాలను ప్రైవేట్‌పరం చేయవద్దని ఐద్వా డిమాండ్‌ చేసింది.. ప్రైవేటు కంపెనీలు పాల ఉత్పత్తులను అమ్మడం మొదలు పెడితే సహకార సంఘాలు కుదేలవుతాయని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం పొందేందుకు, ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యం కిందికి సంఘాలను తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ఆలోచనని వారు పేర్కొన్నారు. పాల కల్తీ, ధరల నియంత్రణ వీలు పడదని, పాల ధరలకూ రెక్కలొచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. 

తప్పుదోవ పట్టిస్తున్నమంత్రులు..

వ్యవసాయ పరిరక్షణ జోన్ల ఆంక్షలపై వస్తున్న ప్రజా నిరసనలను మంత్రులు, సిఆర్‌డిఎ అధికారులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని రాజధాని ప్రాంత సిపిఎం కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు విమర్శిం చారు. రైతుల, రాజధాని ప్రాంత ప్రజల ప్రయోజ నాలను రక్షించాలని చిత్తశుద్ధి ఉంటే నిజాలు చెప్పి మాస్టర్‌ప్లాన్‌ను సమూలంగా మార్చాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ పరిరక్షణ జోన్ల విషయం మంత్రులకే తెలియదని ఎద్దేవా చేశారు. వాస్తవాలను మరుగు పర్చేందుకే అవగాహన సదస్సులు నిర్వహించడం లేదని విమర్శించారు.

తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఇంతెందుకు..?

జూన్‌ లోగా నిర్మాణం పూర్తి చేయాలనుకున్న తాత్కాలిక సచివాలయంపై గందరగోళం నెలకొంటోంది. రోజుకో గ్రామం, పూటకో స్థలంతో ప్రభుత్వం ఈ పరిస్థితిని సృష్టిస్తోంది . అసలు నిర్దిష్ట సమయం లోగా సచివాలయం పూర్తవుతురదా? అనే అనుమా నాన్ని అధికారులే వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి కేటాయిరచాల్సిన స్థలాన్ని రెట్టిరపు చేస్తూ ప్రభుత్వం తాజాగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మురదుగా 20 ఎకరాల్లో సచివాలయాన్ని నిర్మిరచాలని నిర్ణయిరచారు.

అరుణ్ మృతికి సీపీఎం సంతాపం...

 ప్రముఖ జర్నలిస్టు అరుణ్ సాగర్ హఠాన్మరణం చెందారు. సాగర్ మృతికి సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.

కుప్పకూలిన లక్షల కోట్లు..

గురువారం స్టాక్‌ మార్కెట్లు భారీ కుదుపునకు గురవడంతో చిన్న మదుపరులు దాదాపు గల్లంతయ్యారు. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు, చమురు ధర పుష్కర కాల కనిష్ఠానికి పడిపోవడం, అమెరికా ఫెడ్‌ 'అనుమానపు' వ్యాఖ్యలు ఆసియా మార్కెట్లు కుంగడం, దేశీయంగా వృద్ధిపై నెలకొంటున్న కారు మేఘాలు, పెరుగుతున్న బ్యాంకుల నిరర్థక ఆస్తులు, అంతకంతకు పడిపోతున్న రూపాయి విలువ, తగ్గుతున్న వినియోగ వస్తువుల ధరలు వంటి దేశీయ కారణాలతో మార్కెట్లు గురువారం కుదేలయ్యాయి.గురువారం ఒక్క సెషన్‌లో ఏకంగా రూ.3,18,245 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయినట్టయింది.

Pages

Subscribe to RSS - February