తప్పుదోవ పట్టిస్తున్నమంత్రులు..

వ్యవసాయ పరిరక్షణ జోన్ల ఆంక్షలపై వస్తున్న ప్రజా నిరసనలను మంత్రులు, సిఆర్‌డిఎ అధికారులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని రాజధాని ప్రాంత సిపిఎం కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు విమర్శిం చారు. రైతుల, రాజధాని ప్రాంత ప్రజల ప్రయోజ నాలను రక్షించాలని చిత్తశుద్ధి ఉంటే నిజాలు చెప్పి మాస్టర్‌ప్లాన్‌ను సమూలంగా మార్చాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ పరిరక్షణ జోన్ల విషయం మంత్రులకే తెలియదని ఎద్దేవా చేశారు. వాస్తవాలను మరుగు పర్చేందుకే అవగాహన సదస్సులు నిర్వహించడం లేదని విమర్శించారు. వ్యవసాయ పరిరక్షణ జోన్లతో సహా ఈనెల 25లోగా మాస్టర్‌ప్లాన్‌ మార్చాలని, లేకుంటే రైతాంగం సహా అన్ని సంఘాలు చేసే ఆందోళనలకు తాము కూడా మద్దతు ఇస్తామని తెలిపారు.