February

మెట్రోపై జపాన్‌ బృందం పరిశీలన

జపాన్‌ ప్రభుత్వ ప్రతినిధుల బృందం విజయవాడలో పర్యటించనుంది.  మెట్రోరైలుపై క్షేత్రస్థాయిలో ఈ బృందం పరిశీలన చేయనుంది. నగరంలో మెట్రోరైల్‌ స్టేషన్లు వచ్చే ప్రాంతాలను బృంద సభ్యులు పరిశీలించనున్నారు..

పటేల్‌పై దేశద్రోహం కేసువిచారణ..

 గుజరాత్‌లో పటేల్‌ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమించిన పటేల్‌ వర్గనేత హార్దిక్‌ పటేల్‌, మరో ముగ్గురిపై దేశద్రోహం కేసును సిటీ సెషన్స్‌ కోర్టు విచారించనుంది.

సార్వత్రిక సమ్మెపై బ్యాలెట్‌..

కేంద్రప్రభుత్వం నియమించిన 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులను వ్యతిరేకిస్తూ చేపట్టనున్న సార్వత్రిక సమ్మెపై నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేస్‌(ఎన్‌.ఎఫ్‌.ఐ.ఆర్‌), దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌.. ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయాలను సేకరించనున్నాయి. ఇందుకు గాను ఈ నెల 8, 9 తేదీల్లో ఓటింగ్‌ను నిర్వహించనున్నారు. 

కాపు కార్పొరేషన్‌కు 1000cr

ముద్రగడతో చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. గత నాలుగు రోజులుగా ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడతో ప్రభుత్వ ప్రతినిధుల చర్చలు సఫలం కావడంతో ఆయన దీక్ష విరమించారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ ముద్రగడతో అన్ని విషయాలు మాట్లాడామన్నారు. వచ్చే బడ్జెట్‌లో కాపు కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

VC లతో హెచ్‌ఆర్డీ సమావేశం..

దళిత స్కాలర్‌ రోహిత్‌ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలకు మానవ వనరుల అభివృద్ధి శాఖ(హెచ్‌ఆర్డీ) ఇన్నాళ్లకు స్పందించింది. విశ్వవిద్యాలయాల్లో అణగారిన వర్గాలపై వివక్షకు అంతం పలకడానికి అన్ని వర్సిటీల ఉపకులపతిలతో ఫిబ్రవరి18న సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని 46 కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉపకులపతిలను ఢిల్లీకు రప్పించ నుంది.

భూ కేటాయింపులపై ' సిట్‌'

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన భూ కుంభకోణంను తెర పైకి తీసుకురావాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. నరేంద్ర మోడి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ఆనంది బెన్‌ పటేల్‌ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన భూ,నిధుల కేటాయింపుల దుర్వినియోగం పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌ చే విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆనంద్‌ శర్మ డిమాండ్‌ చేశారు.' ప్రభుత్వ ,అటవీ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయి. చాలా తక్కువ మొత్తానికి ఆ భూములను ' కార్పోరేట్‌ మిత్రులకు' అప్పటి గుజరాత్‌ ప్రభుత్వం విక్రయించారు' అని ఆయన ఆరోపించారు.

యూనివర్శిటీలను కబేళాలుగా..

దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలను మానవ కబేళాలుగా మార్చేందుకు కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రయత్నిస్తున్నదని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) విమర్శించింది. ఇటీవలి కాలంలో ఒకదాని తరువాత ఒకటిగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు దారి తీస్తున్న పరిణామాలపై ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయంలో రోహిత్‌ ఆత్మహత్య చిచ్చు చల్లారకముందే మరో యువ మేథావి ప్రాణాలు తీసుకోవటం వంటిప రిణామాలను పరిశీలిస్తే దేశంలోని విశ్వవిద్యాలయాలు విద్యార్ధులు, యువ మేధావుల కబేళాలుగా మారుతున్నాయన్న భావన కలుగక మానదని ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది.

నష్టాల్లో చమురు సంస్థలు..

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గణనీయంగా పడిపోవడంతో ఆయా సంస్థల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, ఆర్థిక సాయం కోసం ప్రపంచ బ్యాంక్‌ను ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపాయి. కాగా, చమురు ధరలు రెండేండ్లలో 70శాతానికి తగ్గాయి. గత ఏడాది జూన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌ 115డాలర్లు (రూ.7వేల 800) ఉండగా, ఈ ఏడాది 60డాలర్లకు (రూ.4072 ) దిగి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నదని నైజీరియా, అంగోలా, ఆఫ్రికాలోని రెండు ప్రముఖ చమురు కంపెనీలు పేర్కొన్నాయి. 

Pages

Subscribe to RSS - February