February

సీపీఎం నాయకులపై గొడ్డళ్లతో దాడి

గుంటూరు సుందరయ్య నగర్ సీపీఎం నాయకులపై దాడి జరిగింది. సీపీఎం సుందరయ్య నగర శాఖ సహాయ కార్యదర్శిగా పని చేస్తున్నా ఆంజనేయులు, సతీష్ గొడ్డళ్లతో కోటేశ్వరరావు, బాజీ అనే వ్యక్తులు దాడి చేశారు. దాడిలో గాయపడిన ఆంజనేయులు, సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజులుగా స్థానిక సమస్యలపై సీపీఎం నేతలు పోరాటం చేస్తున్నారు. దాడికి పాల్పడిన కోటేశ్వరరావు, బాజీలతో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.

నెట్‌న్యూట్రాలిటీ వైపే TRAI

భారత్‌లో ఫేస్‌బుక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నెట్‌ న్యూట్రాలిటీ వైపే మొగ్గు చూపింది. ఒకే సమాచారానికి వేర్వేరు ధరలు నిర్ణయించడాన్ని వ్యతిరేకించింది. నిబంధనలు ఉల్లంఘించే టెలికాం ఆపరేటర్లకు రోజుకు 50 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ప్రజాసమస్యల పరిష్కారానికి ఛలో అసెంబ్లీ..

మార్చిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చి 2 సం||రాలు కావస్తున్నా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చలేదని అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అన్ని వర్గాల ప్రజల సమస్యలను గాలికొదిలేశారన్నారు.

ట్రైమెక్స్‌పై తీవ్ర ఆరోపణలు

పాలక పెద్దల దన్నుతో ఖనిజాలను యధేచ్ఛగా దోచేస్తోందని ఈ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు శాసనసభ ప్రజాపద్దుల కమిటీయే.. ట్రైమెక్స్‌ అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు చేసింది. నిగ్గు తేలేవరకూ తవ్వకాలు ఆపేయాలంటూ ఈ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.

చంద్రబాబుకు 'తుని' ఒక హెచ్చరిక

సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఎదురు దాడికి మించిన ఆత్మరక్షణ లేదన్న సూత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో బాగా ఉపయోగిం చుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఏ సమస్యనైనా తీసుకోండి, అది రాజధాని సమస్యా, పోలవరం సమస్యా లేక రాయలసీమ అభివృద్ధి సమస్యా... ఏదైనా మంచి అంతా తన ఖాతాలో వేసుకోవడం చెడు జరిగితే అధికారుల మీద తోసేయడం, విమర్శలొస్తే ఎదురుదాడికి దిగడం ముఖ్యమంత్రి అనుసరి స్తున్న వ్యూహం. తాజాగా కాపుసామాజిక వర్గం ఆందోళన విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అదే వ్యూహం అనుసరిస్తున్నారు.

రాజధాని యువత - భరోసా లేని భవిత

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని శంకుస్థాపన సభలో ''మీరు చేసిన త్యాగానికి ఏం చేసినా తక్కువే'' అని ఆ ప్రాంత ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. వాస్తవంగా కూడా భూమినే నమ్ముకున్న 29 గ్రామాల రైతులు, ఆ భూములపై ఆధారపడ్డ కూలీలు, సంబంధిత ఉత్పత్తితో ముడిబడ్డ చేతివృత్తిదారులు, చిరు వ్యాపారులు మొత్తం ప్రజానీకం తమ భూములను, ఉపాధిని, జీవనాన్ని రాజధాని నిర్మాణం కోసం వదులుకొని (బలవంతంగా అయినా) త్యాగం చేశారు.

దళితులంటే బాబుకు చిన్నచూపు

కులాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దళితులను చిన్న చూపు చూసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం తగదన్నారు.

నేడు గవర్నర్లతో ప్రణబ్ భేటి

 రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మరో ముఖ్యమైన అత్యున్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దేశ భద్రత, కేంద్ర పథకాల అమలు, ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంపు తదితర అంశాలు అజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లీ వేదికగా ఇవాళ, రేపు జరగనున్న ఈ సదస్సుకు..ప్రధాని మోదీ సహా...కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు హాజరుకానున్నారు. 

మూడు జ్యూట్‌ మిల్లుల లాకౌట్‌..

విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని మూడు జ్యూట్‌ మిల్లులకు సోమవారం ఆయా యాజమాన్యాలు లాకౌట్‌ ప్రకటిం చాయి. వీటిలో కొత్తవలస మండలం సీతంపేట వద్దగల ఓల్డు ఉమా ట్వైన్‌, చింతలదిమ్మ సమీపంలోని న్యూ ఉమా జ్యూట్‌ ప్రొడక్ట్సు, అదే ప్రాంగణంలోని సాయి జ్యూట్‌ ప్రొడక్ట్సు మిల్లులు ఉన్నాయి. ఇక్కడ పని చేస్తున్న సుమారు వెయ్యి మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ మూడు మిల్లులూ ఒకే కుటుంబానికి చెందిన వారివి. 

అయోధ్యపై సుప్రీంతీర్పు తర్వాతే

అయోధ్యలో రామాలయ నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కల్‌రాజ్‌ మిశ్రా తెలిపారు. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీల్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి వుంది, ఆ తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. దాని తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితులను బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. అయితే, బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సాధ్యం చేసి తీరుతామంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

Pages

Subscribe to RSS - February