February

భూసేకరణపై నిరసన వెల్లువ..

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో అసైన్డ్‌ భూముల సేకరణపై నిరసన వెల్లువెత్తింది. సుమారు 500 మంది రైతులు తహసీల్దార్‌ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. మండలంలోని దూబచర్ల, పుల్లలపాడు, ముసళ్లగుంట గ్రామాల పరిధిలోని దళితులు, బిసిలకు చెందిన మూడు పంటలు పండే 150 ఎకరాల అసైన్డ్‌ భూమిని సేకరించి రక్షణరంగ విడి భాగాల తయారీ పరిశ్రమలు నిర్మించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

బీహార్‌లో రాష్ట్రపతి పాలన..

బీహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని లోక్‌ జన శక్తి (ఎల్‌జేపీ) డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని పేర్కొంటూ నితీష్‌ కుమార్‌ ప్రభుత్వంపై మండిపడింది. ఇదే విషయమై గవర్నర్‌ రామ్‌ నాథ్‌ కోవింద్‌ను ఎన్డీయే ప్రతినిధి బృందం కలిసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఎల్‌జేపీ రాష్ట్రపతి పాలనకై డిమాండ్‌ చేయడం గమనార్హం. బీజేపీ నాయకుడు విశ్వేశ్వర్‌ ఓఝా హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కూడా రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ డిమాండ్‌ చేసింది.

దాడులకు భయపడేది లేదు:ఏచూరి

పిఎం ప్రధాన కార్యాలయం(ఎకెజి భవన్‌)పై దాడికి తెగబడిన కాషాయ మూకలు, గత రాత్రి పార్టీ కార్యాలయానికి ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగాయి..కొందరు పనిగట్టుకొని చేతకాక ఇలాంటి దాడులకు పూనుకుంటున్నారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి పేర్కొన్నారు. ఇటువంటి దాడులకు సిపిఎం భయపడదని, వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కావాలనే సిపిఎంపై దాడులకు పాల్పడతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు. చేతనైతే ప్రజాస్వామ్య యుతంగా, సైద్ధాంతికంగా చర్చకు రావాలని, అంతే తప్ప పిరికి పందల మాదిరి వ్యవహరించకూడదని హెచ్చరించారు. 

 

JNUలో నిరసనల హోరు..

జెఎన్‌యులో నిరసనల హోరెత్తాయి. గత మూడు రోజులుగా నిరసనలతో క్యాంపస్‌ అట్టుడుకుతోంది. విద్యార్థి నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ప్రభుత్వ నిరంకుశత్వ, రాజ్యాంగేతర చర్యలకు వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కారు. వీరికి ప్రొఫెసర్లు సంఘీభావం ప్రకటించారు. జాతీయత గురించి మాట్లాడే వాళ్ళు అందులో భాగమైన రాజ్యాంగం గురించి మరచిపోయారని ద్వజమెత్తారు. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను భేషరతుగా విడుదల చేయాలని, అలాగే హిందూత్వ శక్తుల నుంచి యూనివర్శిటీని కాపాడాలని కోరుతూ విద్యార్థులు వర్శిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే సోమవారం వర్శిటీ బంద్‌ సంపూర్ణంగా జరిగింది.

రాజ్ నాథ్ వ్యాఖ్యలపై కరత్ మండిపాటు

ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వ విద్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమం వెనుక పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తొయిబా అధ్యక్షుడు హఫీజ్‌ సయీద్‌ మద్దతు ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ(ఎం) నేత ప్రకాశ్‌కరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ట్విట్టర్‌ల సమాచారం ఆధారంగా రాజ్‌నాధ్‌ వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. 

ప్రతిపక్షాలతో బడ్జెట్‌ భేటీ..

వచ్చే వారం ఆరంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారాన్ని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నేడు ప్రధాన ప్రతిపక్షాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభలోని ప్రతిపక్ష నేతలకు మోడి ఆహ్వానం పంపినట్లు ఓ ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ఇది అఖిలపక్ష సమావేశం కాదని, పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లుల గురించి ఈ సమావేశంలో చర్చించారని ఆ అధికారి తెలిపారు.

కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసన

సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి గూండాల దాడిని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో పలుచోట్ల ఇతర వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ప్రదర్శనలు, రాస్తారోకోలు, సంఘపరివార్‌ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించారు. కొన్నిచోట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.

సి పియం కేంద్ర కార్యాలయం పై దాడికి నిరసన

సి పియం  కేంద్ర కార్యాలయం పై బి జే పి నాయకుల దాడిని కండిస్తూ చిత్తూర్ జిల్లా తిరుపతిలో నిరసన కార్యక్రమం  చేపటారు. ఈ  కార్యక్రమం లో వామపక్ష నాయకులూ, కార్మిక ప్రజసంగాలు పాల్గొనారు .

సి.పి.ఎం. పార్టీ కేంద్ర‌కార్యాల‌యంపై కాషాయ‌మూక‌ల దాడిని ఖండిస్తూ కాషాయ‌కూట‌మి దిష్టిబొమ్మ ద‌గ్దం.

Pages

Subscribe to RSS - February