5 రాష్ట్రాల ఎన్నికలకు సిపిఎం సిద్ధం

సీపీఐ(ఎం) 21వ మహాసభ ఆమోదించిన 'రాజకీయ ఎత్తుగడల పంథా' ఆధారంగానే త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. బెంగాల్‌లో ప్రజలను ఐక్యపరిచి అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం కలిసొచ్చే ప్రజాతంత్రశక్తులతో ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఇక కేరళలో ప్రస్తుత వామపక్ష ప్రజాతంత్ర కూటమితో ఎన్నికల్లోకి వెళ్తామని వెల్లడించారు.