February

దివీస్‌ విస్తరణ ఆపకుంటే పోరు తీవ్రం

చిప్పాడ దివీస్‌ లేబొరేటరీస్‌ మూడో యూనిట్‌ విస్తరణ పనులను ఆపకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాధం హెచ్చరించారు. యూనిట్‌ 3 నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో చిప్పాడ పంచాయతీ పరిధిలోని సిటీనగర్‌ జంక్షన్‌లో రిలే నిరాహార దీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలుత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం లోకనాధం దీక్షాశిబిరాన్ని ప్రారంభించారు.

స‌మ‌ర‌శీల ప్ర‌తిఘ‌ట‌న‌

                 శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని వంశధార నిర్వాసితులు ఆదివారం సమరశీల ప్రతిఘటన చేశారు. తమ భూములకు పరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా పోలీసు బలగాలతో పనులు చేయిస్తుండ టంపై తీవ్ర ఆగ్రహం చెరదారు. శనివారం తమ ఆందోళనా శిబిరాన్ని పోలీసులు కూల్చి వేయడంపై ఆగ్రహంతో ఉన్న నిర్వాసితులు సెక్షన్‌ 30ని ధిక్కరించి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పనుల కోసం అధికారులు వేసిన రేకుల షెడ్డును కూల్చివేశారు. అక్కడున్న పరికరాలను వంశధారలో పడేసి తమ నిరసనను ప్రభుత్వానికి చూపారు. అంతేకాదు స్థానిక తహశీలుదారును ఘెరావ్‌ చేశారు.

ఇళ్ళులేనివారికి ఇళ్ళు, పట్టాలు, రిజిస్ట్రేషన్‌ సమస్యులు పరిష్కరించాల‌ని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా

ఇళ్ళులేనివారికి ఇళ్ళు, పట్టాలు, రిజిస్ట్రేషన్‌ సమస్యు పరిష్కరించాల‌ని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా ముఖ్యమంత్రికి పేద పట్ల చిత్తశుద్ది లేదని నేత విమర్శ

  ముఖ్యమంత్రి పేద పట్ల చిత్తశుద్దిలేదని, వుంటే  ఎన్నికల‌ వాగ్ధానం మేరకు పేదల‌కు ఇళ్ళు, పట్టాలు ఇవ్వాల‌ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు శ్రీ సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. పేదకు ఇళ్ళు, స్థలాలు, రిజిస్ట్రేషన్లు కోరుతూ సిపిఎం, సిపిఐ, వామపక్షా ల నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని తహశీల్థార్‌ కార్యాయం వద్ద ధర్నాలో ఆయన ప్రసంగించారు.  296 జీవో ప్రకారం కొండ, రెవిన్యూ స్థలాల్లో జీవిస్తున్న వారికి క్రమబద్ధీకరించి పట్టాలు ఇస్తామని, రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పినా  ఏదో ఒక కారణంతో పట్టాలు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని, జీవో ఎందుకు ప్రజకు ఉపయోగం లేదనందున అదులో మార్పు చేయాని కోరారు.

19.78 లక్షల కోట్ల బడ్జెట్..

2016-17 సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రపంచమంతా ఆర్థిక మందగమనంలో ఉన్న సమయంలో తాను బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నానని, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. తాము సవాళ్లను అవకాశాలుగా మలుచుకున్నట్లు జైట్లీ తెలిపారు. ద్రవ్యోల్బణం 9శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిందన్నారు. భారత్‌ 7.6 శాతం వృద్ధిరేటు నమోదు చేసినట్లు వెల్లడించారు. లోక్ సభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 సంబంధించి 19.78 లక్షల కోట్ల  బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 

5లక్షలఆదాయం.. పన్ను రాయితీ

లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2016-17 బడ్జెట్ రూ. 19.78 లక్షల కోట్లు అని వెల్లడించారు. ఆదాయ పన్నులో ఎలాంటి మార్పులు లేదని పేర్కొన్నారు. రూ. 5 లక్షల ఆదాయం ఉన్న వారికి ఆదాయపు పన్ను రాయితీ 2వేల నుండి 5వేలకు పెంచారు. 

ఉత్సవాలు కాదు... కార్యచరణ కావాలి

వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి కావాల్సింది ఉత్సవాలు కాదు... అభివృద్ధిపై కార్యచరణ కావాలి' అని సిపిఎం, సిపిఐ నాయకులు డిమాండ్‌ చేశారు. రాయలసీమ అభివృద్ధిని కాంక్షిస్తూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన బస్సుయాత్ర ఆదివారం నాటితో రెండో రోజుకు చేరుకుంది. పుట్టపర్తిలో ప్రారంభమైన యాత్ర కొత్తచెరువు, ధర్మవరం, బత్తలపల్లి, ఎస్కేయూ మీదుగా సాయంత్రానికి అనంతపురం నగరానికి చేరుకుంది. యాత్ర వెళ్లిన ప్రతిచోటా విద్యార్థులు, యువకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ప్రసంగాలు చేసిన అన్ని ప్రధాన కూడళ్లలోనూ జనం ఆసక్తిగా నాయకుల ప్రసంగాలను విన్నారు. ప్రభుత్వాల తీరును ఎండగట్టినప్పుడు చప్పట్లో తమ మద్దతును తెలియజేశారు.

బిసి సబ్‌ప్లాన్‌పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువు

బిసి సబ్‌ ప్లాన్‌ అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బిసి సబ్‌ప్లాన్‌, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ కె.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. పెదబొడ్డేపల్లి రామకోవెల వద్ద ఆదివారం జరిగిన డివిజన్‌ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో 50 శాతంపైగా ఉన్న బిసిల్లో అత్యధిక మంది ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. నిర్థిష్ట, స్థిర ఆదాయాలు లేక దయనీయ పరిస్థితిని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో చేతివృత్తులు, వ్యవసాయం దెబ్బతినడంతో జీవనోపాధి కోల్పోయి దారిద్య్రంలోకి నెట్టబడుతున్నారని వాపోయారు. 

Pages

Subscribe to RSS - February