February

ఉపాధి పనుల కల్పనలో ప్రభుత్వం విఫలం

రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కార్మికులకు ఉపాధిపనులు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎం.రవి, ఆర్‌. చంద్రశేఖర్‌ విమర్శించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. సోమవారం సంఘం నాయకులు రాజధాని ప్రాంత గ్రామాలైన పెనుమాక, ఉండవల్లి, కృష్ణాయపాలెం, మందడం, మల్కాపురం, ఐనవోలు, కురగల్లు, నిడమర్రు, బేతపూడి, నవులూరులో పర్యటించారు. మల్కాపురం నర్సరీల్లో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. ఆరు, ఏడు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడంలేదని మహిళా కార్మికులు సంఘం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కుచ్చుటోపీ..

పోలవరం ప్రాజెక్టు కథ-చారణా కోడికి బారణా మసాలా లాగా ఉంది. కేవలం నాబార్డు రుణంతో సరిపెట్టారు. కానీ, గమనార్హమైన అంశమేమంటే నాబార్డుకు పెట్టుబడి నిధి క్రింద రూ.9,020 కోట్లు కేటాయించారు. ఈ నిధుల నుంచే ఎఐబిపి జాతీయ హోదా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్లు నాబార్డు నుంచి నిధులు ఎంత వరకు లభిస్తాయి. రూ.16 వేల కోట్లు అంచనా ప్రకారం ఇంకా రూ.3,829 కోట్లు రాష్ట్రానికి రావాలి. పైగా ప్రాజెక్టు అంచనాలు పెరిగితే నీతి ఆయోగ్‌ అమోదం పొందాలి. ఇదంతా ఒక విష వలయం. రాష్ట్ర ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న భ్రమ.

మహాజన పాదయాత్రకు సంఘీభావం..

తెలంగాణ రాష్ట్ర సామాజిక, సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో చేపట్టిన మహాజన పాదయాత్ర చారిత్రాత్మకమైందని సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. మహాజన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వందలాది మంది కార్యకర్తలు తెలంగాణాలోని కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం తరలి వెళ్లారు. జిల్లాలోని పోలవరం డివిజన్‌ నుంచి వచ్చిన గిరిజన యువకులు విల్లంబులు చేతబూని, డప్పు వాయిద్యాలతో మహాజన పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు.

Pages

Subscribe to RSS - February