చంద్రబాబు ప్రభుత్వం రెండంకెల అభివృద్ధి జపం చేస్తున్నది. రెండంకెల అభి వృద్ధి సాధన కోసం ఎన్నుకున్న రంగా ల్లో కీలక మైనది ఆక్వారంగం. రాష్ట్రంలో ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా ఆక్వా సాగును ప్రోత్సహిస్తా మని, రాష్ట్రాన్ని ఆక్వా హబ్‌గా మారుస్తామని ప్రభుత్వం ప్రకటిం చింది. కోస్తా ప్రాంతాల్లో ముఖ్యం గా పై మూడు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అధికారికంగానూ, అనధికారికం గానూ లక్షలాది ఎకరాలు చేపలు, రొయ్యల చెరువు లుగా మారాయి. ఇంకా మారుతు న్నాయి.